Site icon Prime9

Gali Anil Kumar: భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత గాలి అనిల్‌కుమార్‌

gali-anilkumar-bjy

 Bharat Jodo Yatra: భారత్‌ జోడో యాత్రతో కాంగ్రెస్‌లో సరికొత్త ఉత్సాహం నింపుతున్నారు రాహుల్‌గాంధీ. కాస్త లేట్‌గా అయినా, లేటెస్ట్‌గా చేపట్టిన యాత్రకు ఆదరణ లభిస్తోంది. ఈ యాత్రలో తెలంగాణ నాయకులు కూడా పాల్గొంటున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నాయకుడు గాలి అనిల్‌కుమార్‌, భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ వెంట కలిసి నడిశారు. యాత్రకు ప్రాచుర్యం లభించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

గతంలో మెదక్‌ ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన గాలి అనిల్‌కుమార్‌ భారత్‌ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన ఈసారి నర్సాపూర్‌ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. భారత్‌ జోడో యాత్రలో గాలి అనిల్‌కుమార్, తన క్యాడర్‌ను దింపారు. రానున్న ఎన్నికల్లో గెలిచి, అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు వ్యూహలను సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్‌ అగ్రనేతలతోపాటు జాతీయస్థాయి నేతలతోనూ టచ్‌లో ఉంటున్నారు. రాహుల్ యాత్రలో పెద్ద పెద్ద హోర్డింగ్‌లు పెట్టించారు. కాంగ్రెస్‌ నేతలతోపాటు కలిసి నడుస్తున్నారు. జోడో యాత్రలో సాంస్కృతిక కార్యక్రమాలతో ఉర్రూతలూగిస్తున్నారు. క్యాడర్‌లో జోష్‌ నింపుతున్నారు.

రాహుల్‌, ప్రియాంకగాంధీ సేనకు గాలి అనిల్‌కుమార్‌ – నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. యాత్ర సందర్భంగా సెపరేట్‌గా టీషర్ట్స్‌ ముద్రించి కార్యకర్తలకు పంచారు. తన కార్యక్రమాలతో భారత్ జోడో యాత్రలో గాలి అనిల్ కూమార్ కీలక వ్యక్తిగా మారారు.రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌ ఆశిస్తున్న గాలి అనిల్‌కుమార్‌ అందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌ నేతల్లో హీట్‌ మొదలయ్యింది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ దృష్టిలో పడేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. టీపీసీసీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఉమ్మడి మెదక్‌ జిల్లాలో విజయవంతం చేయడానికి నిత్యం కృషి చేస్తున్నారు. గ్రూపులకు దూరంగా ఉంటూ అందరివాడు అనిపించుకుంటున్నారు.

మునుగోడు నియోజకవర్గంలో ‘గడప గడపకు కాంగ్రెస్‌’ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డెపల్లి, తిర్మలగిరి గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. ఇలా జిల్లా కార్యక్రమాలతో పాటు తెలంగాణలో కాంగ్రెస్‌ తలపెట్టిన ప్రోగ్రామ్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు గాలి అనిల్‌కుమార్‌. మొత్తంమీద అటు పార్టీ కార్యక్రమాల్లో జోరుగా తిరగడం, తన నియోజకవర్గం టిక్కెట్ తెచ్చుకోవడం లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.

Exit mobile version