CM KCR: దేశంలో మార్పు కోసం పనిచేస్తాం.. మేం ఏ టీం కాదు- కేంద్రంపై కేసీఆర్ ఫైర్

CM KCR: మహారాష్ట్రలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న ఆరోపణలకు గట్టి కౌంటర్స్ ఇచ్చారు. బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ.. మనకంటే చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయి. బీఆర్ఎస్ ఎవరికీ ఏ టీమ్ కాదు.. అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.

CM KCR: మహారాష్ట్రలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న ఆరోపణలకు గట్టి కౌంటర్స్ ఇచ్చారు. బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ.. మనకంటే చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయి. బీఆర్ఎస్ ఎవరికీ ఏ టీమ్ కాదు.. అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. మహారాష్ట్రలో పర్యటిస్తున్న ఆయన పండరీపూర్‌ సమీపంలోని సర్కోలి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. దేశంలో పరివర్తన తెచ్చే పార్టీ బీఆర్ఎస్ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. A టీమ్‌, B టీమ్‌ అని కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న ఆరోపణలను కేసీఆర్ తిప్పికొట్టారు. తాము ఏ పార్టీకి ఏ టీమ్‌.. బీ టీమ్ కాదని తమది రైతులు, దళితులు, అణగారిన వర్గాల టీమ్‌ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

కేంద్రానికి ఎందుకంత ఆక్రోశం(CM KCR)

దేశంలో మార్పు తీసుకురావడం కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుందని కేసీఆర్ వెల్లడించారు. కేంద్రానికి దమ్ముంటే దేశంలో ప్రతీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్ర వైపు తాము వస్తూ మూడు నెలలు కాలేదని, అప్పుడే తమపై కేంద్రానికి ఎందుకింత ఆక్రోశం, ఆగ్రహమని కేసీఆర్‌ ప్రశ్నించారు.

దేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లు ఎందుకు కనిపిస్తున్నాయని.. మేకిన్‌ ఇండియా ఎక్కడికి పోయిందని నిలదీశారు. విధానాలు మారాల్సిన అవసరం ఉందని, దేశంలో పరివర్తన వస్తే దేశంలోని ప్రతీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఎం కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ సర్కోలి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ కేసీఆర్‌ సమక్షంలో ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే భారత్‌ భాల్కే కుమారుడు భగీరథ్‌ భాల్కే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పండరీపూర్‌ పట్టణానికి చెందిన అనేక మంది పార్టీలో చేరారు. అందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేసీఆర్‌ ఆహ్వానించారు.