Prime9

Telangana Formation Day : దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందన్న సీఎం కేసీఆర్‌.. ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. లైవ్

Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఒక పండుగలా జరుగుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల పేరుతో 21 రోజుల పాటు ఈ వేడుకలను జరపనున్నారు. అందులో భాగంగా రాజధాని నగరం హైదరాబాద్ లో జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ హాజరయ్యారు. తొలుత గన్‌పార్క్‌లో స్థూపం వద్ద అమరవీరులకు కేసీఆర్‌ నివాళులు అర్పించారు. అనంతరం సచివాలయం వద్ద జాతీయ జెండా ఎగరేసి.. ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తున్నారు. ఉద్యమంలో ఎన్నో వర్గాలు కదిలాయని.. తెలంగాణ కోసం అమరులలైన వారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. ఎన్నో అరవరోధాలను దాటుకుని తెలంగాణ బలమైన శక్తిగా ఎదిగిందని.. దేశానికి తెలంగాణ ఇప్పుడు దిక్సూచిగా మారింది అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

YouTube video player

Exit mobile version
Skip to toolbar