CM KCR: పాలపిట్ట తెచ్చిన తంట.. వివాదంలో సీఎం కేసిఆర్

శుభాన్ని కల్గించే పాలపిట్టను దసరా రోజున చూడాలంటారు. ఇది తెలంగాణలో బలమైన ఆత్మీయ సెంటిమెంట్. దీని కోసం నేరుగా చూడని వారు సైతం ఫోటోలను షేర్ చేస్తూ పాలపిట్ట వల్ల కలిగే శుభాన్ని ఆశిస్తూ ఉంటారు. సెంటిమెంట్ తో కూడిన ఆ పాలపిట్ట వ్యవహారం ఓకరికి తంట తెచ్చి పెట్టింది. దీంతో ఆ ముఖ్య నేత వివాదంలో చిక్కుకొని గిలగిల లాడుతున్నారు.

Hyderabad: శుభాన్ని కల్గించే పాలపిట్టను దసరా రోజున చూడాలంటారు. ఇది తెలంగాణలో బలమైన ఆత్మీయ సెంటిమెంట్. దీని కోసం నేరుగా చూడని వారు సైతం ఫోటోలను షేర్ చేస్తూ పాలపిట్ట వల్ల కలిగే శుభాన్ని ఆశిస్తూ ఉంటారు. మరో రకంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక పక్షి కూడా పాలపిట్ట కావడంతో పలువురు పండుగ నాడు చూసేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు. సెంటిమెంట్ తో కూడిన ఆ పాలపిట్ట వ్యవహారం ఓకరికి తంట తెచ్చి పెట్టింది. దీంతో ఆ ముఖ్య నేత వివాదంలో చిక్కుకొని గిలగిల లాడుతున్నారు.

వివరాల మేరకు, దసరా రోజున పాలపిట్టను చూసేందుకు సీఎం కేసిఆర్ ప్రగతి భవన్ కోసం పంజరంలో బంధించి తీసుకొచ్చిన పాలపిట్టను కేసిఆర్ తో సహా కుటుంబ సభ్యులు దర్శించుకొని మరీ దండం పెట్టుకొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కాని రాష్ట్ర పక్షితోపాటు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఎవ్వరూ పాలపిట్టను బంధించకూడదు. అలాంటి ఘటన చోటు చేసుకొంటే అది నేరంగా గుర్తించబడతారు.

దసరా రోజును సీఎం కేసిఆర్ మెప్పు పొందేందుకు ఏకంగా అటవీ శాఖాధికారులు పాలపిట్టను పంజరంలో బంధించి తెచ్చారు. దాన్ని కేసిఆర్ దండం పెడుతుండగా ఫోటోలు తీసి అందరికి షేర్ చేసుకొన్నారు. ఇది కాస్తా వివాదానికి దారితీసింది. పాలపిట్టను పంజరంలో బంధించిన విషయం తెలుసుకొన్న పక్షి ప్రేమికులు, జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యాక్ట్ ఉల్లాంఘనలకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకునేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా వైల్డ్ లైఫ్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి వైల్డ్ లైఫ్ బోర్డు చైర్మన్‌గా సీఎం కేసీఆర్ ఉన్నారు. అలాంటిది ముఖ్యమంత్రి తన కోసం పాలపిట్టను బంధించి తనవద్దకు తెప్పించుకోవడాన్ని జంతుప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన సీఎం స్థాయి వ్యక్తే నిబంధనలు భేఖాతరు చేయడం పై విమర్శలు వెళ్లువెత్తున్నాయి.

లంక పై దండయాత్ర చేసే ముందు శ్రీరాముడు ఈ పక్షిని దర్శించుకున్నారని, అందుకే ఆయనను విజయం వరించిందని పౌరాణిక గాథలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా విజయపథంలో నడవాలని రాష్ట్ర పక్షిగా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రభుత్వం ఖరారు చేసింది. పాలపిట్ట ఒక పక్షి. ఇది తెలంగాణ రాష్ట్రము యొక్క రాష్ట్రపక్షి. ఈ పక్షి రోలర్ కుటుంబమునకు చెందినవి. భారత దేశము, ఇరాక్, థాయిలాండ్ దేశాలల్లో ప్రాంతాల్లో కనపడుతూ ఉంటాయి.

అధికారం ఉంది గదా, అంటూ ప్రగతి భవన్‌కు పాలపిట్టను తెప్పించుకోవడం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌కు విరుద్ధమని జంతు ప్రేమికులు అంటున్నారు.

ఇది కూడా చదవండి:  హోంగార్డ్ నిజాయితీ