CM KCR: దేశం మెుత్తం మార్పు తీసుకురావడమే బీఆర్ఎస్ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఏర్పాటు చేసిన భారాస కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని కేసీఆర్ ప్రారంభించారు.
రెండు రోజులపాటు ఈ శిక్షణ శిబిరం కొనసాగనుంది.
కేసీఆర్ విమర్శలు..
దేశం మెుత్తం మార్పు తీసుకురావడమే బీఆర్ఎస్ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఏర్పాటు చేసిన భారాస కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని కేసీఆర్ ప్రారంభించారు.
రెండు రోజులపాటు ఈ శిక్షణ శిబిరం కొనసాగనుంది.
ఈ శిబిరానికి హాజరైన బీఆర్ఎస్ కార్యకర్తలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పై పలు విమర్శలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిన ఇంకా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. 75 ఏళ్లలో కాంగ్రెస్ ఏనాడు అభివృద్ధి గురించి పట్టించుకోలేదని కేసీఆర్ ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలను చూసి ఏదేదో అంటున్నారు.
దేశాన్ని దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్.. ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదని.. ప్రజలు గెలవాలని కేసీఆర్ తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ మోడల్ అమలు కావాలన్నారు.
దేశానికి సరిపడా అమూల్యమైన నీరు ఉన్న కూడా.. ఉపయోగించుకోవడం లేదని విమర్శించారు. ఏటా వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. సాగుకు నీరు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అకోలా, ఔరంగాబాద్‌లో వారానికోసారి తాగునీరు ఇస్తున్నారు. దేశం మొత్తం దాదాపు ఒకే తరహా పరిస్థితి ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో తీవ్రమైన రైతు ఉద్యమాలు జరిగాయి. ఆందోళనల్లో ఎందరో రైతులు తూటాలకు బలయ్యారు. రైతులంటే గౌరవం లేదా? నిత్యం పోరాడుతూనే ఉండాలా? అని కేసీఆర్ ప్రశ్నించారు.