Hyderabad: చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ విచారణలో భాగంగా తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. చికోటి ప్రవీణ్ తో ఉన్న సంబంధాల పై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు సోదరుల పేర్లు బయట కొచ్చాయి. తలసాని సోదరులు మహేష్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్‌ను పిలిచి ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.
గత కొంతకాలంగా వీరు సాగించిన ఆర్థిక లావాదేవీల పై కూడా ఈడీ విచారణ జరుపుతోంది. ఇక, ఇప్పటికే ఈ కేసులో చికోటి ప్రవీణ్‌తో పాటు ఆయన సన్నిహితులను ఈడీ పలుమార్లు విచారించింది. గతంలో చికోటితో కలిసి తలసాని మహేశ్, ధర్మేందర్ యాదవ్ విదేశాలకు వెళ్లినట్లుగా గుర్తించారు. హవాలా, ఫేమా ఉల్లంఘన కింద ఇద్దరినీ విచారిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే ఈడీ అధికారులు చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో చాలామందిని విచారణకు పిలిచారు. కానీ, ఇప్పుడు తలసాని సోదరులను పిలవడం చర్చనీయాంశం అయింది. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, మెదక్ డీసీసీబీ చైర్మెన్ దేవేందర్ రెడ్డిలకు ఈడీ నోటీసులుజారీ చేసింది. రేపు, ఎల్లుండి విచారణకు హజరు కావాలని వీరికి ఈడీ నోటీసులు జారీ చేసింది.