Site icon Prime9

Munugode by poll: సీఈవో వైఖరి అనుమానాస్పదం…బండి సంజయ్

CEO's attitude is suspicious...Bandi Sanjay

Bandi Sanjay: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వైఖరి అనుమానాస్పందంగా ఉందని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ సమయంలో భాజపా అత్యధికం సాధించినా ఫలితాలు వెంటనే వెల్లడించడంలేదన్నారు. తెరాస కీలక నేత వస్తే తప్ప సీఈవో రౌండ్ వారీ ఫలితాలను చెప్పలేని పరిస్ధితి ఉందన్నారు. రౌండ్ల ఫలితాల వెల్లడి ప్రక్రియలో తీవ్ర జాప్యం ఉందన్నారు. మీడియా నుండి వత్తిడి వస్తేనే రౌండ్ల వారీ ఫలితాలు వెంటనే వెల్లడించే పరిస్ధితి ఉందన్నారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. ఇప్పటివరకు ప్రకటించిన రౌండ్ల వారీ ఫలితాల్లో హోరా హోరీగా తెరాస, భాజపా పార్టీల మద్య కొనసాగుతుండడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Munugode By Poll Result 2022 Live: మునుగోడు ఉపఎన్నికల కౌంటింగ్ షురూ.

Exit mobile version