Site icon Prime9

Hyderabad Murder: పొట్ట మొత్తం కోసి పేగులు బయటకు తీసి.. సైకోలా మారిన హరిహర కృష్ణ

hyderabad murder

hyderabad murder

Hyderabad Murder: ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని స్నేహితుడినే అత్యంత కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య అనంతరం నిందితుడు హరిహర కృష్ణ సైకోలా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్య అనంతరం పొట్ట మెుత్తం కోసి పేగులు బయటకు తీసినట్లు దర్యాప్తులో తేలింది.

పోలీసుల దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు.. (Hyderabad Murder)

ఇంజినీరింగ్‌ విద్యార్థి నవీన్‌ హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. నవీన్‌ను హత్య చేసిన అనంతరం హరిహర కృష్ణ.. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. పోలీసుల విచారణలో నేరాన్నీ అంగికరించినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్కరి ప్రమేయమే ఉందా.. ఇంకా ఎవరి పాత్రైన ఉందా అని పోలీసులు విచారిస్తున్నారు. నవీన్‌ను హత్య చేసేందుకు.. హరి మూడు నెలల నుంచి ప్రణాళికతో వ్యవహరించాడు.ఈ హత్య చేసేందుకు.. రెండు నెలల క్రితమే కత్తిని కొనుగోలు చేశాడు. ఈనెల 17న పార్టీ చేసుకుందాం అని పిలిచి.. దారుణ హత్యకు హరికృష్ణ పాల్పడ్డాడు. మెుదట నవీన్ ను గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత సైకోలా మారి తల, మొండెం వేరు చేశాడు. గుండెను చీల్చి, మర్మాంగాలు కోసి ప్రియురాలికి పంపించాడు. పొట్ట మొత్తాన్ని కోసి పేగులను బయటకు తీసినట్టు పోలీసులు తెలిపారు. కత్తి పట్టుకునే ముందు హరి కృష్ణ గ్లౌజులు ధరించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా.. ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ హత్య తీరును చూసి పోలీసులు విస్తుపోయారు.

క్రూర హత్యకు పాల్పడిన నిందితుడి మానసిక స్థితిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. క్రూరంగా చంపడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. నిందితుడిపై ఇదివరకే ఏమైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. హత్యకు ముందు.. క్రైమ్‌, యూట్యూబ్‌ చూసి ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యపై సీన్ రీకన్ట్సక్షన్ చేస్తామని ఎల్బీనగర్ డీసీపీ తెలిపారు. నిందితుడికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని రాచకొండ సీపీ చౌహాన్‌ అన్నారు. నిందితుడిని హయత్‌ నగర్‌ కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ విధించింది.

ఈ నెల 17వ తేదీన హరి దారుణంగా నవీన్‌ను హత్య చేశాడు. అనంతరం అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని గుట్టల్లో పడేశాడు. నవీన్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 17న పార్టీ చేసుకుందామని తన స్నేహితుడి రూమ్‌ కు నవీన్‌ను హరి ఆహ్వానించాడు. పార్టీలో అమ్మాయి గురించి ఇద్దరికీ గొడవ జరిగింది. ఈ విషయాన్ని నవీన్‌.. తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. శంకరయ్య ఇద్దరితో మాట్లాడి గొడవను ఆపారు. అప్పటి నుంచి నాలుగు నాలుగు రోజులైనా కళాశాలకు.. ఇంటికి నవీన్‌ రాకపోవడంతో తల్లిదండ్రులు నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

గుండెను బయటకు తీసి.. మర్మాంగాన్ని కూడా కోసి

ఈ హత్య గురించి పోలీసులు ఒళ్లు గగుర్లు పొడిచే విషయాలను వెల్లడించారు. నవీన్‌ ను దారుణంగా హత్య చేసిన అనంతరం హరి అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసి విచారిస్తుండగా.. పోలీసుల ఎదుట హరి లొంగిపోయాడు. ఈ హత్యతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హరిహర కృష్ణ ఒక సైకో అని తెలుస్తోంది. నవీన్‌ ను కిరాతకంగా హత్య చేశాక ఈ విషయాన్ని ప్రేమించిన అమ్మాయికి ఫోన్ చేసి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయికి పంపిన మెసెజ్ దారుణంగా ఉంది. ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో వేలు అంటూ నవీన్ వేలును కోసి ఆ ఫొటో అమ్మాయికి పంపాడు. ఈ పెదాలే కదా నిన్ను తాకింది.. అంటూ పెదాలు కోసేశాడు. ఈ గుండెనే కదా నిన్ను తాకింది.. అంటూ నవీన్‌ గుండెను కోసి ఆ ఫొటోను కూడా పంపించాడు చేశాడు. చివరకు నవీన్ తలను కోసి దూరంగా పడేశాడు. ఆ తర్వాత నవీన్ మర్మాంగాన్ని కూడా కోసేశాడు. ఇవన్నీ చదివిన అమ్మాయి.. ఓకే వెరీ గుడ్ బాయ్ .. అంటూ సమాధానం ఇచ్చింది. నిందితురాలిగా హరి ప్రియురాలని సైతం ఇందులో చేర్చారు.

Exit mobile version