Site icon Prime9

BRS Mlc Kavitha: ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత.. రేపటి విచారణపై ఉత్కంఠ

BRS Mlc Kavitha

BRS Mlc Kavitha

BRS Mlc Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల, భారత్‌ జాగృతి అధ్యక్షురాలు కవిత బుధవారం ఉదయం ఢిల్లీ బయలు దేరారు.

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు అనే అంశంపై ఢిల్లీలోని మెరిడియన్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కవిత పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, పౌర సమాజం, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు.

మహిళ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో కేంద్రం పెట్టాలని డిమాండ్ పై ప్రతిపక్షాలతో కలిసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు బీఆర్లఎస్ వర్గాలు చెబుతున్నారు.

అన్ని పార్టీలకు కవిత ఏకతాటిపైకి తెస్తున్నారని, అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయడం ద్వారా ఒత్తిడి పెంచవచ్చని చెబుతున్నారు.

 

మరోసారి ఈడీ ముందుకు..( BRS Mlc Kavitha)

అదే విధంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 16 న విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో కవిత రేపు మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

ఆమె తొలిసారి మార్చి 11న ఈడీ ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈడీ అధికారులు 9 గంటలపాటు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు.

మరో సారి విచారణ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.

లిక్కర్ స్కామ్ కేసులో తదుపరి అరెస్టు కవితదే అనే ఊహాగానాల నేపత్యంలో రేపు విచారణలో ఏం జరుగుతుందనేది సస్పెన్స్ గా మారింది.

 

అంజన్న సేవలో..

కాగా, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కవిత మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.

ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండానే వేకువజామున సుమారు ఐదున్నర గంటల సమయంలో ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు.

ఆమె గోత్రనామాలపై ప్రత్యేక పూజలు చేశారు. తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.

Exit mobile version