BRS CM KCR: కేసీఆర్ ప్రభుత్వంపై సీనియర్ నేతలైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గత కొంతకాలంగా వ్యతిరేకతతో ఉన్నారు. పలు సందర్బాల్లో బహిరంగంగానే వీరుద్దరూ కేసీఆర్ పై విరుచుకుపడినా అధిష్టానం ఏ యాక్షన్ తీసుకోలేదు. కాగా తాజాగా వీరిద్దరూ కలిసి ఆదివారంనాడు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో భాగంగా గులాబీ బాస్ ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఘాటు వ్యాఖ్యలతో విమర్శించారు. దీనిపై సీరియస్ అయిన కేసీఆర్ కాసేపటి క్రితం వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
బీఆర్‌ఎస్, పొంగులేటి మధ్యే ఖమ్మంలో కుమ్ములాట..
బీఆర్‌ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత ఏడాదిన్నర నుంచి పార్టీపై ఆగ్రహంతో ఉంటూ వస్తున్నారు. అయినా పొంగులేటిపై అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పలు కార్యక్రమాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన, ఆయన మద్దతిదారులు వ్యాఖ్యలు చేస్తూవచ్చారు. దానికి స్పందించిన కేసీఆర్ పొంగిలేటి మద్దతుదారులపై బీఆర్‌ఎస్ అధిష్టానం వేటు వేసింది. దానికి గానూ దమ్ముంటే తనపై వేటు వేయాలని తన మద్దతిదారులపై కాదంటూ పొంగులేటి సవాల్ విసిరారు. ఈమేరకు పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందన ఇరువురిని బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కేసీఆర్ లేఖలో తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పొంగులేటి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన మద్దతుదార్ల పేర్లను ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో పోటీ అంటూ ఉంటే అది బీఆర్‌ఎస్, పొంగులేటి వర్గానికి మాత్రమే ఉంటుందని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.
ఇక మరోవైపు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం అధిష్టానంపై వ్యతిరేకతతో పొంగులేటి వర్గంతో చేతులు కలపడం వల్ల కేసీఆర్ ఆయనపై కూడా చర్యలు తీసుకున్నారు. వీరిద్దరితో పాటు మరికొందరు నేతలు కూడా పొంగులేటితో చేరే అవకాశాలు ఉన్నాయి మరి వారిపై బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.