Huzurabad: హృదాయ విదాకర ఘటన.. కష్టపడి జాబ్ సంపాదించిన అన్నదమ్ములు.. అంతలోనే విషాదం

Huzurabad: ఆ కుటుంబాన్ని పేదరికం వెంటాడింది. అయిన పేదరికాన్ని లెక్కచేయకుండా ఇద్దరు కుమారులను బాగా చదివించారు.

Huzurabad: ఆ కుటుంబాన్ని పేదరికం వెంటాడింది. అయిన పేదరికాన్ని లెక్కచేయకుండా ఇద్దరు కుమారులను బాగా చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి.. ఆ అన్నదమ్ములు మంచి ఉద్యోగాలు సాధించారు. కానీ అంతలోనే విధి వారి కుటుంబంలో పెను విషాదం నింపింది. చక్కగా చదివి ఉద్యోగాలు సాధించిన కొడుకులు.. ఒకే సమయంలో మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరిని కలచివేసింది. ఇది ఎక్కడ జరిగిందంటే?

కష్టపడి చదివి.. (Huzurabad)

ఆ కుటుంబాన్ని పేదరికం వెంటాడింది. అయిన పేదరికాన్ని లెక్కచేయకుండా ఇద్దరు కుమారులను బాగా చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి.. ఆ అన్నదమ్ములు మంచి ఉద్యోగాలు సాధించారు. కానీ అంతలోనే విధి వారి కుటుంబంలో పెను విషాదం నింపింది. చక్కగా చదివి ఉద్యోగాలు సాధించిన కొడుకులు.. ఒకే సమయంలో మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరిని కలచివేసింది. ఇది ఎక్కడ జరిగిందంటే?

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌ శివారులో ఈ ఘటన జరిగింది. పేదరికం వెంటాడుతున్న.. ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించారు.

కుమారులు కూడా.. మంచి ఉద్యోగాలు సాధించారు. పెద్ద కుమారుడు శివరామకృష్ణ ఇటీవలే రైల్వే శాఖలో టీసీగా కొలువు సంపాదించాడు.

మరో కుమారుడు కుమారుడు హరికృష్ణ బీసీఎస్‌ పూర్తి చేసి ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పని చేస్తున్నాడు. చిన్న కుమారుడికి తపాలశాఖలోను ఉద్యోగం వచ్చింది.

దీంతో ఏ ఉద్యోగం చేయాలనే విషయమై చర్చించుకున్నారు. ఇక తిరిగి విధులకు వెళ్తున్న క్రమంలో.. అనంతసాగర్‌ వద్ద గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

మిన్నంటిన రోదనలు..

అమ్మా.. నాన్నకు వెళ్లొస్తామని చెప్పి బయలుదేరిన కుమారులు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

ప్రమాదం విషయం తెలిసి తల్లిదండ్రులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు.

మరణోత్తర పరీక్షల అనంతరం మృతదేహాలను గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలను నిర్వహించారు.

మృతదేహాలను చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగే అన్నదమ్ములు ఒకేసారి మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.