Site icon Prime9

Union Minister Kishan Reddy: అరచేతిలో బ్యాంకింగ్.. ఇదే డిజిటల్ బ్యాంకు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Banking in the palm of your hand...this is the aim of digital bank

Banking in the palm of your hand...this is the aim of digital bank

Jangaon: దేశలోని ప్రజలందరికి అరచేతిలో బ్యాంకింగ్ సౌకర్యాన్ని తీసుకురావడమే డిజిటల్ బ్యాంకుల ఏర్పాటు ఉద్ధేశంగా కేంద్ర సాంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆజాద్ కా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా 75 డిజిటల్ బ్యాంకుల్లో మూడు బ్యాంకులను తెలంగాణాలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జనగాంలో ఏర్పాటు చేసిన బ్యాంకు సభలో ఆయన ప్రసంగించారు. కార్య్రక్రమంలో జనగాం శాసనసభ్యులు ముత్రెడ్డి యాదగిరి రెడ్డి, డిజిటల్ బ్యాంకు హైదరాబాదు వింగ్ అధికారులు అమిత్, అశ్విన్ కుమార్ మెహత, తదితరులు పాల్గొన్నారు. 11 ప్రభుత్వ బ్యాంకులు, 12 ప్రైవేటు బ్యాంకులు, 1 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగాలు, డిజిటల్ బ్యాంకు వ్యవస్ధలో భాగస్వామ్యంగా ఉన్నాయన్నారు. సిరిసిల్లా, ఖమ్మం, జనగాం జిల్లా కేంద్రాల్లో డిజిటల్ బ్యాంకులు ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ బ్యాంకు సేవలకు ప్రజలు మద్దతు పలుకుతున్నారన్నారు. సామాన్య ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన లావాదేవీలన్నీ ఇక పై డిజిటల్ బ్యాంకుల రూపంలో సాగనున్నాయన్నారు.

రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం, విద్యార్ధులకు అందించే స్కాలర్ షిప్ లు, రైతులకు అందించే 6వేల వంటి రుణాల వంటి ఇతరత్రా రుణాలను ఆయన ఉదహరించారు. డిపాజిట్లు, రుణాల మంజూరు, వివిధ ఖాతాలను కూడా నేరుగా బ్యాంకుకు రాకుండానే నెట్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చన్నారు. నేడు వ్యాపారసంస్ధల దగ్గర నుండి దేశ వ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారులు సైతం డిజిటల్ సేవల వైపు మక్కువ చూపుతున్నారన్నారు.

జనధన్ అకౌంట్ల ద్వారా ఇప్పటివరకు 25 లక్షల కోట్ల రూపాయలను వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం బదిలీలు జరిగాయన్నారు. 50 కోట్ల జనధన్ ఖాతాలు దేశ వ్యాప్తంగా ఉంటే, అందులో 1కోటి ఖాతాలు తెలంగాణలోని పేదలకు మంజూరు చేశామన్నారు. కేంద్రం ప్రకటించిన వంద శాతం నిధులు నేరుగా లబ్ధిదారుడుకి అందించే క్రమంలో ఇలాంటి చర్యలు తీసుకొంటున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

దోపిడీ మాఫియాకు చెక్ పెట్టడమే ఉద్ధేశంగా చెప్పుకొచ్చారు. 4లక్షల కోట్ల బోగస్ రేషన్ కార్డులను రద్దు చేసే అవకాశం డిజిటల్ వ్యవస్ధ ద్వారానే కట్టడి చేయగలిగామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 4లక్షల కోట్ల అక్రమ గ్యాస్ కనక్షన్ల మాఫియాను అరికట్టిన ఘనత నేటి కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న డిజిటల్ చర్యలతో సాధ్యమయిందన్నారు.

త్వరలో మూడు వందల కోట్ల రూపాయల ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్ధుల స్కాలర్ షిప్ లను డిజిటల్ బ్యాంకు అకౌంట్ల ద్వారా బదిలీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం నుండి విద్యార్ధుల బ్యాంకు వివరాలు అందాల్సి ఉందన్నారు. డిజిటల్ బ్యాంకుల ద్వారా భవిష్యత్ లో విద్యార్ధులకు ఒన్ క్లాన్ ఒన్ టివి పేరుతో విద్యా భోదన చేయనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:Hyderabad: తెలంగాణలో రెండు ఆర్టీసి డిపోలు మూసివేత

 

 

Exit mobile version