Site icon Prime9

Bandi Sanjay: ప్రభుత్వానికి భయమెంటో చూపిస్తాం.. బండి సంజయ్ మాస్ వార్నింగ్

bandi kumar

bandi kumar

Bandi Sanjay: తెలంగాణలో వచ్చేది రామరాజ్యం, బిజేపీ ప్రభుత్వం మేనని బండి సంజయ్ అన్నారు. మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో నిర్వహించిన ధర్నాలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

తామెంటో చూపిస్తాం..

తెలంగాణలో వచ్చేది రామరాజ్యం, బిజేపీ ప్రభుత్వం మేనని బండి సంజయ్ అన్నారు. మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో నిర్వహించిన ధర్నాలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారాన్నిసిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ప్రశ్నపత్రాల లీకేజీతో నిరుద్యోగుల బతుకులు ఆగమయ్యాయని దానికే కేసీఆర్ బాధ్యత వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో దొంగలను పట్టుకోవాలని చెబితే.. సిట్ అధికారులు తమకు నోటీసులు అందిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిర్లక్ష్యంతో.. 30 లక్షల మంది అభ్యర్థుల జీవితాలను నాశనం చేశారని విమర్శించారు. మంత్రి కేటీఆర్ ఉసరవెల్లిలా మాట్లాడుతున్నారని, విచారణ జాప్యంతో నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతుందని సంజయ్ ఆరోపించారు.

తెలంగాణలో వచ్చేది రామరాజ్యం

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది బిజేపీ ప్రభుత్వం మేనని బండి సంజయ్ అన్నారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి పాలనకు వ్యతిరేకంగా బిజేపీ యుద్దాన్ని ప్రారంభించిందని అన్నారు. బిజేపీ యువ మోర్చా కార్యకర్తలను అకారణంగా జైల్లో పెడుతున్నారని.. మాకు జైళ్లు కొత్త కాదు, దేశం కోసం.. ధర్మం కోసం తెగించి కొట్లాడుతామని సంజయ్ అన్నారు.

Exit mobile version