Site icon Prime9

Bandi sanjay: ప్రశ్నపత్రం లీకేజీ కేసు.. బండి సంజయ్‌ కు 14 రోజుల రిమాండ్

SSC Paper Leak Case

SSC Paper Leak Case

Bandi sanjay: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టయిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఈ నెల 19 వరకు ఆయన రిమాండ్ లో ఉండనున్నారు.

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1 గా ఉన్నారు. దీంతో హన్మకొండలోని నాయ్యమూర్తి నివాసంలో బండి సంజయ్ ను హాజరుపరిచారు. ఈ కేసులో పోలీసుల రిమాండ్‌ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి.. 14 రోజులు రిమాండ్ విధించారు.

మరోవైపు.. తనపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు తనపై గాయాలను న్యాయవాదులకు చూపించారు. ఇక బండి సంజయ్ ను ఖమ్మం జైలుకు తరలించే అవకాశముందని తెలుస్తోంది. న్యాయమూర్తి నివాసం ఎదుట పోలీసులు భారీగా మోహరించారు.

బండి సంజయ్ ను తీసుకువెళ్లే క్రమంలో భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక మెజిస్ట్రేట్ ముందు వాడీవేడీగా వాదనలు సాగాయి. ఈ కేసులో మరింత విచారణ చేసేందుకు.. బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించాలనే కోరికను ఆమోదించారు న్యాయవాది. ఇక బండి సంజయ్ అరెస్ట్ అక్రమమని.. అతడి తరపు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

చొక్కా విప్పిన బండి..

కాగా.. పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని బండి సంజయ్ తన న్యాయవాదులకు చెప్పారు. చొక్కా తీసి తన ఒంటిపై గాయాలను కూడా చూపించారు. పోలీసులు వ్యవహరించిన తీరు, అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు బండి వివరించారు.

Exit mobile version