Site icon Prime9

Bandi Sanjay: బండి సంజయ్‌ విడుదల.. కేసును సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్

bandi sanjay

bandi sanjay

Bandi Sanjay: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీలో బండి సంజయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. హన్మకొండ మెజిస్ట్రేట్ ఆయనకు 14 రిమాండ్ విధించారు. దీనిని సవాల్ చేస్తూ.. హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గురువారం ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.

జైలు నుంచి విడుదల.. (Bandi Sanjay)

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీలో బండి సంజయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. హన్మకొండ మెజిస్ట్రేట్ ఆయనకు 14 రిమాండ్ విధించారు. దీనిని సవాల్ చేస్తూ.. హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గురువారం ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. బండి సంజయ్ విడుదల నేపథ్యంలో.. కరీంనగర్ లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంచారు. సాయంత్రం వరకు.. దుకాణాలు మూసి ఉంచాలని పోలీసులు సూచించారు.

రూ. 20 వేల పూచీకత్తు..

సంజయ్ బెయిల్ పై గురువారం రోజంతా ఉత్కంఠ నెలకొంది. సూదీర్ఘ విచారణ అనంతరం బెయిల్ మంజూరు చేశారు. రూ.20 వేల సొంత పూచీకత్తుతోపాటు పలు షరతులు విధించారు.

దేశం దాటి వెళ్లొద్దని, సాక్షులను ప్రభావితం చేసే విధంగా ప్రవర్తించవద్దని ఆదేశించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం.. బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

ఈ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

పదో తరగతి ప్రశ్నపత్రాలను లీకే చేసింది తెరాస అని బండి సంజయ్ ఆరోపించారు. ఈ విషయంపై.. మంత్రి కేటీఆర్ ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులకు రూ.లక్ష సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పేపర్‌ లీక్‌ తో సంబంధం లేదని నా పిల్లలు, దేవుడిపై ప్రమాణం చేస్తా.

నేను కుట్ర చేసినట్లు ఆరోపిస్తున్న సీపీకి ప్రమాణం చేసే దమ్ముందా?సీపీ చెప్పింది నిజమైతే తన మూడు సింహాల టోపీపై ప్రమాణం చేసి చెప్పాలి.

నన్ను గంటల తరబడి వాహనాల్లో ఎందుకు తిప్పారు? లీకైన పేపర్‌ను జర్నలిస్టు షేర్‌ చేస్తే తప్పేంటి? ఎగ్జామ్‌ సెంటర్‌లోకి వెళ్లి పేపర్‌ ఎలా లీక్‌ చేస్తారు.?

నేను వేల మందితో సెల్ఫీలు దిగుతా.. అందరితో నాకు లింకులున్నట్లేనా? నష్టపోయిన టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులతో వరంగల్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.

Exit mobile version