Site icon Prime9

Bandi Sanjay: రేవంత్ రెడ్డి కంటతడిపై స్పందించిన బండి సంజయ్

bandi-sanjay-public-meeting

bandi-sanjay-public-meeting

Bandi Sanjay: భాగ్యలక్ష్మీ అమ్మవారి సన్నిధి ఎదుట రేవంత్ రెడ్డి కంటతడి పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. పదవి పోతుందన్న భయంతోనే.. రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

స్పందించిన బండి సంజయ్.. (Bandi Sanjay)

భాగ్యలక్ష్మీ అమ్మవారి సన్నిధి ఎదుట రేవంత్ రెడ్డి కంటతడి పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. పదవి పోతుందన్న భయంతోనే.. రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. దీంతో టీపీసీసీ పదవి పోతుందనే భయంతోనే.. రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలతో రేవంత్ రెడ్డి సతమతమవుతున్నారని సంజయ్ విమర్శించారు. మునుగోడు ఉపఎన్నికలో రూ. 25కోట్లు రేవంత్‌రెడ్డికి ఇచ్చారని భాజపా ఎమ్మెల్యే ఈటల ఎక్కడా అనలేదని.. కాంగ్రెస్‌కు ఇచ్చినట్లు మాత్రమే ఆయన చెప్పారన్నారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ భాగ్యలక్ష్మీ ఆలయానికి రావాలన్న తన కోరిక నెరవేరిందన్నారు. తెలంగాణకు భారాస, ఎంఐఎం పార్టీలు అవసరమా అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

 

చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి.. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఈటెల పై ఆయన మండి పడ్డారు.

మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. 25 కోట్లు ఇచ్చారంటూ ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించడాన్ని రేవంత్‌ తీవ్రంగా తప్పుబట్టారు.

ఈ మేరకు చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేశారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌తో లాలూచీ పడటం నా రక్తంలోనే లేదు. చివరి శ్వాస విడిచే వరకు కేసీఆర్‌తో రాజీ పడే ప్రసక్తే లేదు.

ఒక వేళ మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్‌ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా.. నా కుటుంబం మొత్తం సర్వనాశనమైపోతుంది.

మునుగోడు ఉపఎన్నిక పరిణామాలు అందరికీ తెలుసు. బీఆర్ఎస్, బీజేపీలు భారీగా డబ్బులతో బరిలోకి దిగాయని.

కానీ కాంగ్రెస్‌ మాత్రం నిజాయితీగా పని చేసే అభ్యర్థి పాల్వాయి స్రవంతిని పోటీలో నిలిపింది.

మునుగోడు ఉపఎన్నిక కోసం ఆ రెండు పార్టీలు భారీగా డబ్బులు ఖర్చు చేశాయి. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అమ్ముడు పోయిందని ఈటల ఆరోపించారు.

కేసీఆర్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ, పాల్వాయి స్రవంతి రూ. 25 కోట్లు తీసుకున్నారని విమర్శించారు. నా నిజాయితీని అనుమానిస్తే మంచిది కాదు.

నా కళ్లలో నీరు రప్పించావు. కేసీఆర్‌ సర్వమంతా దారబోసినా రేవంత్‌ రెడ్డిని కొనలేరు. రాజీ నా రక్తంలో లేదు. భయం నా ఒంట్లో లేదు’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Exit mobile version
Skip to toolbar