Site icon Prime9

Bandi Sanjay: పదో తరగతి పేపర్ లీక్ కేసు.. ఏ1 గా బండి సంజయ్

bandi kumar

bandi kumar

Bandi Sanjay: తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఆయన్ను ఏ1గా చేర్చారు. పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఆయన్ను ఏ1గా చేర్చారు.

పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాసేపట్లో బండి సంజయ్ ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు. రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు బండి సంజయ్ ను ఏ1గా చేర్చారు.

ఏ2గా ప్రశాంత్.. ఏ3గా మహేశ్, ఏ4 గా శివగణేష్ పేరును చేర్చారు. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. మెుత్తం ఇందులో పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

A5 శివ గణేష్, A6 పోగు సుభాష్, A7 పోగు శశాంక్, A8 దులాం శ్రీకాంత్, A9 గా శార్మిక్, A10 గా పాతబోయిన వసంత్, A11 గా బండి సంజయ్ పీఏ ప్రవీణ్.

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు

బండి సంజయ్ ను అరెస్ట్ చేసి తిప్పడంపై.. హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. బండి సంజయ్ ఎక్కడ ఉన్నారో చెప్పాలని హెబియస్ కార్పస్ పిటిషన్ ను భాజపా నేత సాంరెడ్డి సురేందర్‌రెడ్డి వేశారు.

బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఇందులో పేర్కొన్నారు.

ఆయన్ను అరెస్ట్ చేసే సమయంలో కనీస నిబంధనలను పోలీసులు పాటించలేదని.. విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలపలేదని ఆక్షేపించింది.

ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు..

బండి సంజయ్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పోలీసులు కీలక విషయాలను నమోదు చేశారు.

ప్రశ్నపత్రాల లీకేజీలో బండి సంజయ్ హస్తం ఉన్నట్లు పోలీసులు అందులో పేర్కొన్నారు.

దీంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద భాజపా నేతలు ధర్నాలు చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితుడితో భాజపా నేత కొద్ది రోజులుగా టచ్ లో ఉన్నట్లు అందులో పేర్కొన్నారు.

విద్యార్ధుల్లో గందరగోళం సృష్టించడానికే ఈ లీకేజీలు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు.

Exit mobile version