Site icon Prime9

Balapur Ganesh 2023 : మరోసారి వేలంలో రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ.. ఎంత ? ఎవరు కొన్నారంటే ??

balapur ganesh 2023 laddu aution got high price

balapur ganesh 2023 laddu aution got high price

Balapur Ganesh 2023 : ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా వినాయక చవితి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రులు పూజలందుకున్న గణనాథులను నిమజ్జనం కోసం సాగనంపుతున్నారు. ఇక ఈ క్రమం లోనే ఇప్పటికే నిమజ్జన కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా  హైదరాబాద్ నగరంలో వినాయక చవితి అంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ విఘ్నేశ్వరుడి లడ్డూ వేలం గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటారు.

భాయాత్ర భక్తజన సందోహం మధ్య కోలాహలంగా సాగుతుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గణపతి లడ్డూలను దక్కించుకొనేందుకు భక్తులు పోటీపడుతున్నారు. పలు ప్రాంతాల్లో లడ్డూ ధరలు లక్షల్లో పలుకుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో లడ్డూ ధర ఏకంగా కోటి పలికింది. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట దేశ వ్యాప్తంగా ప్రసిద్ది పొందింది. వందల నుండి ప్రారంభమైన వేలం ప్రస్తుతం లక్షలకు చేరుకుంది. బాలాపూర్ లడ్డూను వేలంలో దక్కించుకున్న వారికి మంచి జరుగుతుందని బాగా విశ్వాసం ఉంది. దీంతో ఈ లడ్డూను దక్కించుకొనేందుకు భక్తులు వేలం పాటలో పోటీ పడుతారు.

బాలాపూర్ లడ్డూ .. 27 లక్షలు..

ఈ క్రమంలో ఈ ఏడాది కూడా బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలంలో మొత్తం 36 మంది పాల్గొన్నారు. గతేడాది 29 మందికి తోడు కొత్తగా ఏడుగురు వేలంలో పాల్గొన్నారు. ప్రారంభం నుంచి పోటాపోటీగా వేలం ప్రక్రియ కొనసాగింది. చివరకు దాసరి దయానంద రెడ్డి రూ. 27లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. బాలాపూర్ లడ్డూ చరిత్రలోనే ఇది అత్యధిక ధర. గతేడాది లడ్డూ రూ. 24.60లక్షలు పలికింది. తాజాగా ధరతో సరికొత్త రికార్డు నమోదైంది. వేలం పాట సందర్భంగా బాలాపూర్ గణేశ్ వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గణపతి ఉత్సవ సమితి లడ్డూ వేలంపాటను 1994 నుంచి నిర్వహిస్తుంది. మొదటిసారిగా 1994లో లడ్డూవేలం రూ.450తో ప్రారంభమైంది. అయితే, 2020లో కరోనా కారణంగా లడ్డూవేలం జరగలేదు.

బాలాపూర్ ను లడ్డూను దక్కించుకొంది ఎవరంటే..

1994 – కొలను మోహన్ రెడ్డి – రూ. 450

1995 – కొలను మోహన్ రెడ్డి – రూ.4,500

1996 – కొలను కృష్ణారెడ్డి – రూ.18 వేలు

1997 – కొలను కృష్ణారెడ్డి – రూ.28 వేలు

1998 – కొలను మోహన్ రెడ్డి – రూ.51 వేలు

1999 – కళ్లెం ప్రతాప్ రెడ్డి – రూ.65 వేలు

2000 -కొలను అంజిరెడ్డి – రూ.66 వేలు

2001 – జి. రఘునందన్ రెడ్డి – రూ.85 వేలు

2002 – కందాడ మాధవరెడ్డి – రూ.1,05,000

2003 – చిగిరినాథ బాల్‌రెడ్డి – రూ.1,55,000

2004 – కొలను మోహన్ రెడ్డి – రూ.2,01,000

2005 – ఇబ్రహీ శేఖర్ – రూ.2,08,000

2006 – చిగురింత తిరుపతి రెడ్డి – రూ.3లక్షలు

2007 – జి. రఘునాథమ్ చారి – రూ.4,15000

2008 – కొలను మోహన్ రెడ్డి – రూ.5,07,000

2009 – సరిత – రూ.5,10,000

2010 – కొడాలి శ్రీధర్ బాబు – రూ.5,35,000

2011 – కొలను బ్రదర్స్ – రూ.5,45,000

2012 – పన్నాల గోవర్ధన్ రెడ్డి – రూ.7,50,000

2013 – తీగల కృష్ణారెడ్డి – రూ.9,26,000

2014 – సింగిరెడ్డి జైహింద్ రెడ్డి – రూ.9,50,000

2015 – కొలను మధన్ మోహన్ రెడ్డి – రూ.10,32,000

2016 – స్కైలాబ్ రెడ్డి – రూ.14,65,000

2017 – నాగం తిరుపతిరెడ్డి – రూ.15,60,000

2018 – శ్రీనివాస్ గుప్తా – రూ. 16,60,000

2019 – కొలను రామిరెడ్డి – రూ.17 లక్షల 60 వేలు

2020 – కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు – సీఎం కేసీఆర్ కుటుంబానికి అందించారు.

2021 – మర్రి శశాంక్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ – రూ.18 లక్షల 90 వేలు

2022 – వంగేటి లక్ష్మారెడ్డి – రూ. రూ.24 లక్షల 60 వేలు

2023 – దాసరి దయానంద్‌రెడ్డి – రూ. 27లక్షలు

Exit mobile version