Site icon Prime9

Telangana Politics: తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన అస్సాం సీఎం

Assam CM who made Telangana politics hot

Assam CM who made Telangana politics hot

Hyderabad: దేశమంతా ప్రధాని మోధీ ప్రభంజనమే. మరో 30ఏళ్లు అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. తెలంగాణాలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే. డబ్బులుంటే జాతీయ పార్టీ పెట్టడం సులభమే. కెసిఆర్ ను ప్రజలు నమ్మరంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ తెలంగాణా రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటి ఆహ్వానం మేరకు హైదరాబాదు గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గచ్చిబౌలి మీడియా సమావేశంలో ఆయన  రాజకీయాలపై పలు ఆసక్తికర అంశాలను వెళ్లడించారు.

రానున్న ఎన్నికల్లో ప్రత్యేక అస్త్రాలతో తాములేమని, కేవలం మోదీనే మా బ్రహ్మాస్త్రంగా హిమంత్ బిశ్వ శర్మ కుండ బద్దల కొట్టిన్నట్లు చెప్పారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 400సీట్లు బిజెపి వస్తాయని జోస్యం చెప్పిన అస్సాం సిఎం తెలంగాణాలో వచ్చేది బిజెపి ప్రభుత్వమంటూ పేర్కొన్నారు. బిజెపి ముక్త భారత్ కంటే ముందుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టాలని సిఎం కెసిఆర్ కు హితవు పలికారు. బిజెపి బలమే ప్రజల ఆధారణ అన్న బిశ్వ శర్మ కెసిఆర్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టే జాతీయ పార్టీ పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారం వస్తే ఉచిత విద్యుత్ అంటున్న కెసిఆర్ మాటలు ఎవ్వరూ నమ్మరని, ప్రజలు మోదీకి గుండెల్లో స్ధానం ఇచ్చారని అందరికి తెలుసన్నారు. తెలంగాణాలో ఎట్టి పరిస్థితుల్లో నిజాం రాజ్యాన్ని రజాకర్ల పాలనను రానివ్వమంటూ గట్టిగానే బదులిచ్చారు. రాహుల్ జోడో యాత్రపై మాట్లాడిన అస్సాం సిఎం కాంగ్రెస్ హయాంలో విడదీసిన దేశాలను అఖండ భారత్ తో నాంది పలకాలనేది నా ఉద్దేశంగా ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.

అస్సోంలో ఇటీవల కూల్చివేసిన మదర్సాల నిర్ణయం సరైనదేనని బిశ్వ శర్మ సమర్ధించుకొన్నారు. ఉగ్రవాదంసై అస్సాం ప్రభుత్వం పోరు సాగుతుందని వారికి ఆశ్రయం ఇచ్చేవారు ఎంతటి వారైన ఉపేక్షించేది లేదన్నారు. కూల్చిన మదర్సాల్లో పిల్లలకు పాఠాలకు బదులు యువతను జీహాద్ వైపు ఆకర్షించేలా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్సిస్తున్న కారణంగానే కూల్చివేసామన్నారు. ఇంకా అలాంటి సంస్ధలపై దాడులు, కూల్చివేతలు సాగుతాయని స్పష్టం చేసారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన ఉగ్రవాదులతో పలు రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నాయని విచారణలో తేలిందని, దానిపై సంబంధిత వ్యవస్ధలు వివరాలు అందిస్తాయన్నారు.

Exit mobile version