Waterhole: తెలంగాణలో అకాల వర్షాలు ప్రజలను అతలకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్ లో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో మరో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మూడు రోజుల క్రితం.. కళాసిగూడలో మౌనిక అనే చిన్నారి నాలాలో పడి మృతిచెందిన విషయం తెలిసిందే. ఇది జరిగిన రెండు మూడు రోజుల్లోనే ఇలాంటి మరో ఘటన చోటు చేసుకోవడం.. ఆందోళన రేకెత్తిస్తోంది.
ఆరేళ్ల బాలుడు మృతి..
తెలంగాణలో అకాల వర్షాలు ప్రజలను అతలకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్ లో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో మరో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మూడు రోజుల క్రితం.. కళాసిగూడలో మౌనిక అనే చిన్నారి నాలాలో పడి మృతిచెందిన విషయం తెలిసిందే. ఇది జరిగిన రెండు మూడు రోజుల్లోనే ఇలాంటి మరో ఘటన చోటు చేసుకోవడం.. ఆందోళన రేకెత్తిస్తోంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. నగరవాసులను అతలకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయమయ్యాయి. దీంతో హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు రోజుల క్రితం.. కళాసిగూడలో ఓ చిన్నారి మృతి చెందగా.. తాజాగా జూబ్లీహిల్స్‌లో ప్రమాదవశాత్తు ఓ బాలుడు నీటి గుంతలో పడి మృతి చెందాడు.