Amith Sha: కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఆయన త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 15 వ తేదీన భద్రాచలంలో అమిత్ షా పర్యటన ప్రారంభమవుతుంది. అమిత్ షా 15వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు అల్పాహార బ్రేక్ తీసుకోనున్నారు. అదే సమయంలో రాష్ట్ర ముఖ్య నేతలతో కూడా సమావేశం అవుతారు. శంషాబాద్ విమానశ్రయం నుంచి మధ్యాహ్నం 1.10 గంటలకు భద్రాచలానికి బయల్దేరతారు.
బీజేపీ బహిరంగ సభలో(Amith Sha)
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.20 వరకు భద్రాద్రి రామయ్య ను అమిత్‌షా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. తర్వాత ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు శంషాబాద్‌కు తిరిగి పయనమవుతారు. రాత్రి 7 గంటలకు పలువురు నేతలతో వేర్వేరుగా సమావేశం అవ్వనున్నట్టు తెలుస్తోంది. రాత్రి 9.30 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అమిత్‌షా ఢిల్లీకి బయలుదేరుతారు.