Site icon Prime9

Amit Shaw tour: అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే!

bjp central minister Amit Shah speech at huzurabad meeting

bjp central minister Amit Shah speech at huzurabad meeting

Amit Shaw tour: రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటినుంచే నియోజకవర్గాల నేతలు.. ప్రచారంలో మునిగితేలుతున్నాయి. అయితే ఈ నెల 23 న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. దీంతో ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ పెంచబోతోంది. చేవెళ్లలో నిర్వహించే.. బహిరంగ సభలో అమిత్ షా ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది.

అమిత్ షా పర్యటన.. (Amit Shaw tour)

రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటినుంచే నియోజకవర్గాల నేతలు.. ప్రచారంలో మునిగితేలుతున్నాయి. అయితే ఈ నెల 23 న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. దీంతో ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ పెంచబోతోంది. చేవెళ్లలో నిర్వహించే.. బహిరంగ సభలో అమిత్ షా ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది.

అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉంది. దీంతో అటు అధికారు బీఆర్ఎస్ తో పాటు.. భాజపా, కాంగ్రెస్ పార్టీలు దూకుడు పెంచాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొడుతూ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అయితే ఈ నెల 23న చేవెళ్ల సభలో అమిత్‌ షా సభ నిర్వహించనున్నారు. ఈ సభతో అమిత్ షా బీజేపీ తరపున ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరిస్తారని భాజపా శ్రేణులు అంటున్నాయి. దీంతో అందరూ ఈ సభ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

షెడ్యూల్‌ ఇదే!

పార్లమెంటరీ ప్రవాస్‌ యోజన సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. దీని కోసమే ఆయన తెలంగాణకు రానున్నారు.

ఆదివారం సాయంత్రం.. 3:30 గంటలకు శంషాబాద్‌ చేరుకుంటారు. 3:50కి శంషాబాద్‌ నోవాటెల్‌కి చేరుకుంటారు.

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఆస్కార్‌ విజేతలతో సాయంత్రం 4 గంటల నుంచి 4:30 వరకు తేనీటి విందులో పాల్గొననున్నారు.

ఆ తర్వాత 5.15కి అక్కడి చేవెళ్లకు రోడ్డు మార్గంలో బయల్దేరి వెళతారు.

 

సాయంత్రం 6గంటలకు చేవెళ్ల చేరుకొని.. భారీ బహిరంగలో పాల్గొననున్నారు. ఈ సభలో కీలక నేతలు భాజపాలో చేరనున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అమిత్‌షా కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు సైతం పార్టీలో చేరేలా రాష్ట్ర ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

వీరి చేరిక కోసం జాతీయ నాయకత్వం కూడా ప్రత్యేక కసరత్తు చేస్తోంది.

ఇక సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
తిరిగి రాత్రి 7.45 నిమిషాలకు శంషాబాద్ నుంచి దిల్లీకి పయనమవుతారు.

Exit mobile version