Site icon Prime9

Amit Shah: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు?

Amit Shah

Amit Shah

Amit Shah: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దు అయింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూలై 15 న అమిత్ షా ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. ఇందు కోసం రాష్ట్ర బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. అయితే అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌జాయ్‌’ తుపాను అత్యంత తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై, గుజరాత్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

దీంతో బిపోర్ జాయ్ తుపాన్ కారణంగా పరిస్థితులను దగ్గరుండి సమీక్షించాల్సిన అవసరం ఉందని… ఈ క్రమంలో ఆయన తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. దీంతో ఖమ్మంలో జరుగుతున్న సభ ఏర్పాట్లను బీజేపీ నాయకులు నిలిపివేశారు.

 

బీజేపీ శ్రేణుల్లో నిరాశ( Amit Shah)

కాగా అమిత్ షా తెలంగాణ పర్యటన ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని బీజేపీ భావించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తో పాటు తెలంగాణలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు.. అమిత్‌ షా పర్యటన తో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆ పార్ట నేతలు అనుకున్నారు. అయితే తాజాగా అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు కావడంతో కాషాయం శ్రేణులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రేపటి సభకు ఏర్పాట్లన్నీ పూర్తి అయిన తర్వాత పర్యటన రద్దు కావడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Exit mobile version