Site icon Prime9

Amith Shah: ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లిన అమిత్ షా… ఎందుకో తెలుసా..!

Amith shah meet etela

Amith shah meet etela

Amith Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి ఆయన వెళ్లారు. ఇటీవలే ఈటల తండ్రి మల్లయ్య మృతి చెందారు. కాగా వారి ఇంటికి వెళ్లి మల్లయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించారు.

హైదరాబాద్ శివార్లలోని శామీర్ పేటలో ఉన్న ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లిన అమిత్ షా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈటలతో 15నిమిషాల పాటు రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు, తెలంగాణ విమోచన దినోత్సవాల్లో అమిత్ షా పాల్గొన్న సంగతి విధితమే. అనంతరం బీజేపీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమై మునుగోడు ఉప ఎన్నికపై చర్చించారు.

ఇదీ చదవండి: Amit Shah: అమిత్ షా కాన్వాయ్ కి కారు అడ్డు.. అద్దాలు పగులగొట్టి మరీ..

Exit mobile version