Site icon Prime9

Munugode by poll: మునుగోడు ఉప ఎన్నికకు భారీ బందోబస్తు.. రాచకొండ సీపి

All arrangements are ready for the by-election- Rachakonda CP

Munugode: రేపటిదినం జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు భారీ పోలీసు బందోబస్తును కల్పించిన్నట్లు రాచకొండ సీపి మహేశ్ భగవత్ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాల నడుమ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేశామన్నారు.

ఉప ఎన్నిక నేపధ్యంలో 35 సున్నిత ప్రాంతాలను గుర్తించిన్నట్లు సీపి తెలిపారు. హింసాత్మక ఘటనలకు అవకాశం ఉన్న కేంద్రాల్లో పోలీసు నిఘా పెంచామన్నారు. మొత్తం 2వేల పోలీసులతో ఎన్నికలు విధుల్లో ఉన్నారన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమరాల నిఘా ఉందన్నారు. చెక్ పోస్టుల్లో వాహనాల తనిఖీలు యధావిధిగా సాగుతున్నాయన్నారు. బైండోవర్ కేసులున్న వారిని అదుపులోకి తీసుకొన్నామన్నారు.

గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనున్నది. 2,41,855 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. నేడు ఎన్నికల అధికారులు ఎన్నికల సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. చండూరులోని డాన్‌ బోస్కో కళాశాలలో ఎన్నికల సామగ్రిని పంపిణీ జరిగింది. సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకొని పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు.

ఇది కూడా చదవండి: Bandi Sanjay: నెట్టింట భాజపా అధ్యక్షుడి రాజీనామా లేఖ.. పాతపాటేనంటూ కొట్టిపారేసిన బండి సంజయ్

Exit mobile version