Site icon Prime9

BJP VS TRS: టిఆర్ఎస్, భాజాపా మద్య యాడ్స్ లొల్లి

Ads war between BJP, TRS parties

Ads war between BJP, TRS parties

Hyderabad: ప్రచారంలో తొలి ఓటు మాకేనంటూ టిఆర్ఎస్ పార్టీ భాజాపా నేతలకు జలక్ ఇచ్చింది. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినంగా భాజాపా సిద్దం కాగ, అదే రోజు నుండి తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలను చేపట్టేందుకు టిఆర్ఎస్ ప్లాన్ వేసింది. ఇందుకోసం కేసిఆర్ అండ్ టీం ఓ అడుగు ముందుకేసి మెట్రో, ఆర్టీసి సంస్ధలతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకొనింది. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రకటనలు మాత్రమే ప్రచారం చేసేలా యాడ్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకొనింది. భారతీయ జనతా పార్టీకి ప్రకటనలు లేకుండా ఉండేలా టిఆర్ఎస్ ఎదురు దెబ్బ తీసింది. భాజాపా ప్రచారానికి యాడ్ ఏజెన్సీలు నో చెప్పాయి. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గు మంటున్నారు.

యాడ్స్ విషయం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ తమ పార్టీకి అవకాశాలు ఇవ్వకుండా మెట్రో పిల్లర్లు, ఆర్టీసీని టీఆర్ఎస్ బుక్ చేసుకొనడాన్ని తప్పుబట్టారు. చిల్లర రాజకీయాలుగా చిత్రీకరించారు. ఆర్టీసీ బస్సులు అడిగితే అధికారులు లేవంటున్నారా, ఆ విధంగా వ్రాసి ఇవ్వమంటే భయపడుతున్నారని తెలిపారు. బస్సు అద్దెల ను సైతం 6వేల నుండి 18వేలకు పెంచడాన్ని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. అసద్ ను ఒప్పించి సిఎం కేసీఆర్ సమైక్యతా దినోత్సవం లేఖ రాయించాడని పేర్కొన్నారు. మోదీ హయాంలో పైరవీలు లేకుండా పోయాయన్న కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ ఎందుకు రాడని ప్రశ్నించాడు. కేటీఆర్, కవితలకు కరోనా ఎందుకొచ్చిందో అర్ధం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.

తెలంగాణ గ్రామాల్లో బీజేపీ లేకపోతే కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్‌లో ఎంపీ సీట్లు ఎలా గెలిచామని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పాపులారిటీ ఉంటేనే ఎన్నికల్లో గెలుస్తామనడం సరైంది కాదన్నారు. తమ కార్యకర్తలు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా కష్టపడుతున్నారని, సమస్యలపై ఆందోళనలు చేస్తున్నారని, లాఠీ దెబ్బలు తింటున్నారని చెప్పారు. ఎవరు గట్టిగా పోరాడితే వాళ్ళే గెలుస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికల్లో జార్ఖండ్, బీహార్, రాజస్థాన్‌లో బీజేపీ గెలుస్తోందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. మేం నేషన్ ఇంట్రెస్ట్‌తో పని చేస్తాం, టీఆర్ఎస్ వాళ్ళు కుటుంబం కోసం పని చేస్తారని ఎద్దేవా చేశారు. కార్యకర్తలను కేంద్రమంత్రులను చేసే పార్టీ మాది. తెలంగాణాలో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు రాజకీయ వాతావరణం క్రియేట్ చేశాం. ఎవరిని కలిసినా ఈసారి బీజేపీ గెలుస్తోందన్న టాక్ వినిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ ఓడిపోతుంది. బెంగాల్‌లో డబ్బు పట్టుబడిన తర్వాత మమతా వీక్ అయ్యారన్న కిషన్ రెడ్డి కలగూర గంప రాజకీయాలు దేశాన్ని బ్రష్టు పట్టిస్తాయే కాని వాటి వల్ల ఏమీ కాదని పేర్కొన్నారు.

Exit mobile version