Nalgonda: నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అమ్మాయి ఇంటిక వెళ్లిన యువకుడిని కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో జరిగింది.
ఇంటికి వెళ్లిన యువకుడు..
నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అమ్మాయి ఇంటిక వెళ్లిన యువకుడిని కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో జరిగింది. తమ కుమార్తెను తరచూ వేధిస్తుండటం వల్లే యువకుడిపై దాడి చేసినట్లు వారు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుమార్తెను వేధిస్తున్నాడనే నెపంతో యువకుడిని బాలిక కుటుంబ సభ్యులు దాడిచేసి హతమార్చారు. ఈ ఘటన గుర్రంపోడు మండలం కొప్పోలులో చోటు చేసుకుంది.
కొప్పోలుకు చెందిన బాలిక పదో తరగతి చదువుతుంది. కట్టంగూరు మండలం దుగినెల్లి గ్రామానికి చెందిన బొడ్డు సంతోష్ నకిరేకల్ లో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గత ఆరు నెలల నుంచి.. సంతోష్ బాలిక వెంట పడుతున్నాడు. ఇదే విషయంపై బాలిక తల్లిదండ్రులు షీ టీమ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సంతోష్ కు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయిన కూడా యువకుడు అలాగే బాలిక వెంటపడ్డాడు.
ఇదే సమయంలో.. గురువారం యువకుడు స్నేహితులతో కలిసి కొప్పోలుకు వచ్చాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో.. బాలిక ఇంట్లోకి వెళ్లాడు. ఇది గమనించిన బాలిక నానమ్మ బయట నుంచి గడియ పెట్టింది. ఇది గమనించిన స్నేహితులు.. అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే వచ్చిన బాలిక తండ్రి యాదయ్య, కుటుంబసభ్యులతో కలిసి సంతోష్‌పై కర్రలతో దాడికి దిగాడు. ఈ క్రమంలో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఎస్సై శివప్రసాద్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.