Telangana: తెలంగాణాలో నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల బరిలో 47మంది అభ్యర్ధులు నిలిచారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.
మొత్తం నామినేషన్ల సెట్ల సంఖ్య 199 రాగ, అందులో నామినేషన్లు వేసిన వారు 130మందిగా పేర్కొన్నారు. స్క్రూటినీలో 47మంది నామినేషన్లను తిరస్కరించారు. 36మంది అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉప సంహరించుకొన్నారు. నామినేషన్ల విత్ డ్రాకు గడువు ముగియడంతో ఎన్నికల బరిలో 47మంది అభ్యర్ధులు నిలిచిన్నట్లు అధికారుల ప్రకటించారు.
ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఎన్నికల ప్రచారంలో తమ జోరును పెంచారు. పాలక, ప్రతిపక్షాలకు సంబంధించిన ఉద్ధండ శ్రేణులు తమ అభ్యర్ధులకు ఓటు వేయాలంటూ కాళ్ల మొక్కులు, ఆప్యాయాలు, మద్యం, నగదు ప్రలోభాలతో ఓటర్లు తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నాలకు ఊపు తెచ్చారు. అన్నింటికి మించి సోషల్ మీడియా వేదికగా ఒక పార్టీపై మరొక పార్టీ బురద జల్లుకుంటూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. నవంబర్ 6న మునుగోడు ఉప ఎన్నిక లెక్కింపుతో నేతల మాటల తూటాలకు చెక్ పడనుంది.
ఇది కూడా చదవండి: MLA Jaggareddy: నోటు ఎవరిచ్చినా.. మీదే తీసుకోండి.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి