Site icon Prime9

Hyderabad: హైదరాబాద్‌లో 276 శాతం పెరిగిన పాదచారుల మరణాలు

Pedestrian-deaths-in-Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో2019తో పోల్చితే 2021లో రోడ్డు ప్రమాదాల కారణంగా పాదచారుల మరణాలు 276% పెరిగాయి. ఇది దేశంలోని 53 నగరాల్లో 2019లో 22 నుండి ఏడవ స్థానానికి చేరుకుంది. అయితే పాదచారుల గాయాల పరంగా (590), హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సి ఆర్ బి ) విడుదల చేసిన తాజా యాక్సిడెంట్స్ అండ్ సూసైడ్స్ ఆఫ్ ఇండియా (ఎడిఎస్ఐ) డేటా ప్రకారం, 2021లో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 94 మంది పాదచారులు మరణించారు. అంతేకాకుండా, నగరంలో జరిగిన 297 రోడ్డు ప్రమాద మరణాలలో, పాదచారుల మరణాలు 31% గా ఉన్నాయి.

తెలంగాణా అంతటా పాదచారుల మరణాలు 2020తో పోలిస్తే 2021లో 169% మరియు 2019 నుండి 265% పెరిగాయి. తెలంగాణలో పాదచారుల మరణాలు (1,310) 2021లో మొత్తం రోడ్డు ప్రమాద మరణాలలో 17% మరియు రాష్ట్రం ఏడో స్థానంలో నిలిచింది. అలాగే, 2021లో రాష్ట్రం మరియు నగరానికి సంబంధించి పాదచారుల మరణాల సంఖ్య 2014లో తెలంగాణా అవతరించినప్పటి నుండి అత్యధికం. మొత్తం మీద, 2014 మరియు 2021 మధ్య రాష్ట్రంలో 3,695 పాదచారుల మరణాలు నమోదయ్యాయి.

Exit mobile version