Site icon Prime9

Munugode: మునుగోడుపై నోట్ల దందా.. రూ.19లక్షలతో పట్టుబడిన కారు..!

munugode rs 19lacks seized

munugode rs 19lacks seized

Munugode: మునుగోడు బైపోల్ సందర్భంగా రోజురోజుకు రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పైకి పథకాలు, వాగ్ధానాలు అంటూనే మరోవైపు ప్రజలకు ఓటుకు నోటు ఆశచూపుతారంటారనేది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం నాడు బీజేపీ నాయకుడి కారులో రూ. కోటి పట్టుబడగా.. ఇవాళ మరో కారులో రూ. 19 లక్షలు పట్టుబడ్డాయి. కాగా ఆ కారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిదని అందులో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, కండువాలు లభ్యమైనట్లు సమాచారం.

అయితే ఈ పట్టుబడ్డ రూ. 19 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గట్టుప్పల్ నుంచి పుట్టపాక వెళ్లే దారిలో వెళ్తున్న TS 07 FY 9333 బ్రీజా కారును పోలీసులు ఆపి చెక్‌ చేయగా, అందులో రూ. 19 లక్షల డబ్బు బయటపడిందని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: మునుగోడులో కాంగ్రెస్ టెన్షన్.. చేతులెత్తిసిన నేతలు

Exit mobile version