Site icon Prime9

Pen Drive: పేపర్‌ లీకేజీలో మరిన్ని విషయాలు వెలుగులోకి.. పెన్‌ డ్రైవ్‌లో 15 ప్రశ్నపత్రాలు

tspsc

tspsc

Pen Drive: ప్రశ్నపత్రాల లీకేజీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మెుత్తం ఇప్పటి వరకు 15 ప్రశ్నపత్రాలు లీకేజీ అయినట్లు సిట్ గుర్తించింది. నిందితుల పెన్ డ్రైవ్ లో 15 ప్రశ్నపత్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

పెన్ డ్రైవ్ లో ప్రశ్నపత్రాలు..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నపత్రాల లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సిట్ వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఇక తాజాగా ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల పెన్ డ్రైవ్ లో 15 ప్రశ్నపత్రాలు ఉన్నట్లు గుర్తించారు.

ఇందులో గ్రూప్ 1 ప్రిలిమ్స్.. ఏఈఈ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ – డీఏవో, ఏఈ జనరల్ స్టడీస్ వంటి పరీక్షలతో పాటు.. జులైలో జరగాల్సిన జేఎల్‌ ప్రశ్నపత్రాలు నిందితుల పెన్‌ డ్రైవ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో 15 మందిని నిందితులుగా చేర్చారు. ప్రశ్నపత్రాల లీకేజీలో నిందితులు లక్షల్లో నగదు మార్పిడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

పేపర్ లీకేజీలో నగదు లావాదేవీలపో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులోకి ఈడీ కూడా ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి.

కమిషన్ కీలక నిర్ణయం..

పబ్లిక్ కమిషన్ సర్వీస్ పై తీవ్ర విమర్శలు రావడంతో.. సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంపై.. కమిషన్ మెంబర్లను విచారించాలని సిట్ నిర్ణయించింది. దీంతో బోర్డు సభ్యుల స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేయనున్నారు.

ఈ కేసును వేగంగా దర్యాప్తు చేసేందుకు.. సిట్ దూకుడు పెంచింది. నాంపల్లి కోర్టు అనుమతితో నిందితులు షమీమ్‌, సురేష్‌, రమేష్‌ను సిట్‌ ఐదు రోజుల పాటు ప్రశ్నించనుంది.

 

Exit mobile version
Skip to toolbar