Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా నీరు, విద్యుత్, వ్యవసాయోత్పత్తులకు సరైన ధర కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అభివృద్ధి కోసం పిలుపునిచ్చారు.
మహారాష్ట్రలో ఎక్కువ రైతు ఆ్మహత్యలు..(Telangana CM KCR)
దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అందులో మహారాష్ట్రలో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని నదులు ప్రవహిస్తున్నప్పటికీ రైతులు ఎందుకు తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో 24 గంటల కరెంటు, నీటి సదుపాయం రైతుల ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిందని చెప్పారు.కొత్త జాతీయ జల విధానం రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నికల్లో గెలవడమే పార్టీల లక్ష్యంగా మారిపోయిందని కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలుపార్టీలు కాదని అన్నారు.దేశంలో 48 శాతం మంది రైతులే ఉన్నారు.
వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తే 60 శాతం మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్యం తరువాత కూడా దేశ ప్రజలకు తాగునీరు లేదన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రజా సమస్యలు పరిష్కరించాలని కేసీఆర్ అన్నారు. ఈ సందర్బంగా మహారాష్ట్రకు చెందిన పలువురు మాజీ శాసనసభ్యులు, నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు.