Telangana High Court: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ ల ప్రమాణస్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు వీరిచేత ప్రమాణస్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వారి అభ్యంతరంతో..(Telangana High Court)
గత జూలై నెలలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. అయితే గవర్నర్ తమిళి సై వీరి నియామకాలను తిరస్కరించారు. దీనితో వారిద్దరు హైకోర్టును ఆశ్రయించారు. పది రోజులకిందట ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. ఇరువైపులా న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. తమ పిటిషన్ విచారణ తేలేంత వరకు ఎమ్మెల్సీల నియామకం ఆపాలంటూ దాసోసు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కోదండరాం, అమీర్ అలీఖాన్ ల ప్రమాణస్వీకారానికి బ్రేక్ ఇచ్చింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు యథాస్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.