Site icon Prime9

BCY Party: తెలంగాణ ఎన్నికలు.. మొదటి జాబితా విడుదల చేసిన బీసీవై పార్టీ

BCY party

BCY party

 BCY Party: తెలంగాణ ఎన్నికల బరిలో దిగేందుకు సమాయత్తమైన భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. గత వారం రోజులుగా అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు నిర్వహించిన రామచంద్ర యాదవ్ గురువారం  20 మందితో తొలి జాబితాను విడుదల చేశారు.

బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కొద్ది రోజుల క్రితమే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పార్టీ కార్యాలయం ప్రారంభించిన సమయంలోనే నవంబర్ 1వ తేదీన పార్టీ మేనిఫెస్టో, అభ్యర్ధుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు. అయితే అనివార్య కారణాల వల్ల నిన్న అభ్యర్ధుల జాబితా ప్రకటన వాయిదా పడింది.

తొలి జాబితాలో టిక్కెట్లు దక్కింది వీరికే..( BCY Party)

కొల్లాపూర్ అభ్యర్ధిగా కాటమోని తిరుపతమ్మ, కార్వార్ అభ్యర్ధిగా ఏనుముల రమ్యశ్రీ యాదవ్, ఖుత్బుల్లాపూర్ అభ్యర్ధిగా కే మంజులతారెడ్డి, మేడ్చల్ అభ్యర్ధిగా ఓరుగంటి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం అభ్యర్ధిగా కవడగాని శ్రీనివాస్ యాదవ్, మిర్యాలగూడ అభ్యర్ధిగా బొడ్డు వెంకన్న యాదవ్, ఆదిలాబాద్ అభ్యర్ధిగా గుడిపెల్లి గణేష్, వరంగల్లు వెస్ట్ అభ్యర్ధిగా సాయిని రవీందర్, జడ్చర్ల అభ్యర్ధిగా పిల్లెల శ్రీకాంత్, హూజూరాబాద్ అభ్యర్ధిగా బావు తిరుపతియాదవ్, సంగారెడ్డి అభ్యర్ధిగా కొవ్వూరి సత్యనారాయణ గౌడ్, మంచిర్యాల అభ్యర్ధిగా రామగిరి శ్రీపతి, ఆందోల్ అభ్యర్ధిగా యర్రారమ్ దేవదాస్, సికింద్రాబాద్ అభ్యర్ధిగా పన్నీర్ మోహన్ రాజు, జుక్కల్ అభ్యర్ధిగా జీ రాజశేఖర్, మునుగోడు అభ్యర్ధిగా అచ్చన శ్రీనివాసులు, గోషమహల్ అభ్యర్ధిగా మేకల వివేక్ యాదవ్, మహబూబ్ నగర్ అభ్యర్ధిగా తిప్పా కృష్ణ ముదిరాజ్. పరకాల అభ్యర్ధిగా అబ్బడి బుచ్చిరెడ్డి, రాజేంద్రనగర్ అభ్యర్ధిగా వి చంద్రశేఖర్ గౌడ్ లను ఎంపిక చేసినట్లు పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించారు.

Exit mobile version