Telangana EAPCET Results: తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAPCET) 2024 ఫలితాలు శనివారం ప్రకటించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వారిలో 1,80,424 మంది (74.98 శాతం) ప్రవేశానికి అర్హత సాధించారు. ఇందులో 1,42,716 మంది పురుష అభ్యర్థులు పరీక్ష రాయగా, వారిలో 1,06,162 మంది (74.38 శాతం) అర్హత సాధించారు. మొత్తం 97,902 మంది మహిళా అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, 74,262 మంది (75.85 శాతం) అర్హత సాధించారు.
అగ్రికల్చర్ మరియు ఫార్మసీ స్ట్రీమ్‌లో 91,633 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 82,163 మంది (89.66 శాతం) అర్హత సాధించారుఅగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌లో 24,664 మంది పురుషులు పరీక్షకు హాజరు కాగా వారిలో 21,768 మంది (88.25 శాతం) అర్హత సాధించారు. పరీక్షకు హాజరైన మహిళా అభ్యర్థుల సంఖ్య 66,969కాగా వారిలో అర్హత సాధించిన వారు 60,395 మంది ఉన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, హైదరాబాద్ (JNTUH) నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర EAPCET పరీక్ష, తెలంగాణ (134 కేంద్రాలు) మరియు ఆంధ్రప్రదేశ్ (31 కేంద్రాలు) రెండింటిలో మే 7 నుండి 11 వరకు నిర్వహించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించారు.