Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం దిశగా దూసుకువెడుతోంది. ఈ నేపధ్యంలో టీ కాంగ్రెస్ నేతలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. అంజనీ కుమార్ తో పాటు ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ లు రేవంత్ ను కలిసారు. అనంతరం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేసి ర్యాలీగా గాంధీ భవన్ కు బయలుదేరారు.
ఆశయాలు, ఆకాంక్షలు..(Revanth Reddy)
ఇలా ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండగానే రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ చేసారు. తెలంగణ ఉద్యమంలో ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంత చారి వర్దంతి సందర్బంగా నివాళులు అర్పించారు. అమరుల ఆశయాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమయింది అంటూ ట్వీట్ చేసారు.
అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు.
శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది.#Srikantachary #Telangana #Martyr pic.twitter.com/juCnioj70j
— Revanth Reddy (@revanth_anumula) December 3, 2023