Site icon Prime9

Sajjala Ramakrishna Reddy: టీడీపీ డ్రామాలు పీక్స్‌కి చేరాయి.. సజ్జల రామకృష్ణారెడ్డి

ajjala Ramakrishna Reddy

ajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: టీడీపీ డ్రామాలు పీక్స్‌కి చేరాయని అందులో భాగంగానే చంద్రబాబుకు ముప్పు ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తప్పు చేసినట్లు ఆధారాలున్నాయని కోర్టు ధ్రువీకరించిందని అన్నారు.

లోకేష్ మాటలు చూస్తే నవ్వొస్తోంది..(Sajjala Ramakrishna Reddy)

జైలుకు వచ్చాక చంద్రబాబు 5 కేజీలు తగ్గలేదు, ఒక కేజీ పెరిగారని సజ్జల అన్నారు. జైలులో ఏసీ పెట్టడానికి అదేమన్న అత్తగారి ఇల్లా? ఉక్కపోతతో మిగతా ఖైదీలకు ఇబ్బంది ఉండదా?:అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు కోసం 24 గంటల పాటు వైద్యులను ఉంచారని తెలిపారు. అయితే చంద్రబాబు కుటుంబం దబాయిస్తోందని ఎలాగైనా బయటకు తీసకు రావాలన్నదే వారి ఆలోచన అని అన్నారు.అమిత్‌షా భేటీపై లోకేష్ చిట్‌చాట్ మాటలు చూస్తే నవ్వొస్తోందని సజ్జల అన్నారు. అమిత్ షానే లోకేష్‌ను పిలిచారని టీడీపీ బిల్డప్ ఇస్తోంది. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ లేదని నిరూపించడానికి అమిత్ షా లోకేష్‌ను పిలిచారని చెప్పుకుంటున్నారని అన్నారు.

లోకేష్‌ను కలవాలని అమిత్ షాకు తపన ఉంటే ఆయనే వచ్చే వారు కదా..?ఈ కేసుకి, పొలిటికల్ పార్టీలకు ఏమి సంబంధం? బీజేపీ, వైసీపీకి కేసుతో సంబంధం ఏంటి..?అని సజ్జల అడిగారు. టీడీపీని ఎటాక్ చెయ్యాలనుకుంటే పొలిటికల్‌గా చేస్తామని అన్నారు. రెండేళ్లు సీఐడీ విచారణ చేసి ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేసింది. ఈ కేసును చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కేంద్ర దర్యాప్తు సంస్థలు బయటకి తెచ్చాయని అన్నారు. ఈడీ, ఐటీ, జీఎస్‌టీ వంటి సంస్థలు నోటీసులు కూడా ఇచ్చాయని సజ్జల చెప్పారు.

లోకేష్..!  ఆయన డ్రామా ఏందో ఏమో..ఎవరికి అర్థం కాదు | Sajjala Aggressive Comments On Nara Lokesh

Exit mobile version
Skip to toolbar