Site icon Prime9

Supreme Court: తెలంగాణ సర్కార్ కు ఎదురుదెబ్బ.. విద్యుత్ కమీషన్ ఛైర్మన్ ను మార్చాలన్న సుప్రీంకోర్టు

Supreme Court

Supreme Court

 Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ విద్యుత్ విచారణ కమీషన్హ పై మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ ముగిసింది. విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నర్సింహారెడ్డి స్థానంలో కొత్త వారిని ఛైర్మన్‌గా నియమించాలని ఆదేశించింది.

విచారణ ప్రతీకారమే..( Supreme Court)

కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి అభిప్రాయాలు చెప్పడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి విమర్శించారు.విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. సోమవారం కొత్త పేరు చెప్తామని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. విచారణ సందర్బంగా ష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా, కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ఇప్పటికే ట్రిబ్యునళ్లు ఉండగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై న్యాయమైన విచారణ ఎలా జరుగుతుందని రోహత్గీ ప్రశ్నించారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంక్షోభం కారణంగా విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని, మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు యూనిట్ రూ.3.90 మాత్రమే జరిగాయని వాదించారు. మాజీ, ప్రస్తుత ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఈ అంశంపై అనేక ఆర్టీఐ దరఖాస్తులు పెట్టారని, విచారణ ప్రతీకార చర్య అని రోహత్గీ సూచించారు. ఈఆర్‌సీ ఉండటంతో ప్రత్యేక విచారణ కమిషన్‌ అవసరం లేదని ఆయన వాదించారు. అత్యవసర సమయాల్లో టెండర్లు లేకుండానే విద్యుత్‌ను కొనుగోలు చేసేలా నిబంధనలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నుంచే కొనుగోళ్లు జరిగాయని రోహత్గీ వివరించారు. అలాగే భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌కు వినియోగించిన సబ్‌క్రిటికల్ టెక్నాలజీని ప్రభుత్వ సంస్థల ద్వారానే అమలు చేశామని స్పష్టం చేశారు.

 

 

Exit mobile version
Skip to toolbar