Site icon Prime9

Kakinada: పాఠశాలలో కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్ధినులు…కాకినాడ జిల్లాలో ఘటన

Students whose eyes fell back in school...incident in Kakinada district

Students whose eyes fell back in school...incident in Kakinada district

Kakinada: స్కూలుకు వెళ్లిన విద్యార్ధినులు హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయిన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకొనింది. వివరాలమేరకు, యు. కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 20 రోజులుగా వింత సమస్యతో విద్యార్ధినులు బాధపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్ధిని శ్వాస తీసుకోవడంలో కల్గిన ఇబ్బందితో కళ్లు తిరిగి పడిపోయింది. అనంతరం నిన్నటిదినం రాత్రి ఇదే సమస్యతో 9,10 తరగతి చదువుచున్న కొంతమంది విద్యార్ధులు కళ్లు తిరిగిపడిపోయారు. వీరిని స్థానిక వైద్యశాలలో చికిత్స చేయించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అయితే నేడు మరో 7గురు విద్యార్ధులు ఇదే తరహాలో కళ్లు తిరిగి పడిపోయారు. హుటాహుటిన వారిని స్థానిక పీహెచ్సీకి తరలించారు. అయితే చికిత్స సమయంలో ఒక ఆక్సిజన్ కిట్ మాత్రమే ఉండడంతో ఒకరి తర్వాత ఒకరికి ఆక్సిజన్ ఇస్తున్న సంగతిని స్థానిక మాజీ ఎమ్మెల్యే వర్మ గుర్తించి వైద్యాధికారులపై మండి పడ్డారు. తక్షణమే కాకినాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలని డిమాండ్ చేశారు. దీంతో రెండు అంబులెన్సులలో బాధిత విద్యార్ధులను కాకినాడకు తరలించారు.

హఠాత్తుగా ఎందుకు శ్వాస తీసుకొనేందులో విద్యార్ధులకు ఇబ్బంది ఎదురౌతుందన్న కోణంలో వైద్యులు పరిక్షలు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో పాఠశాలలోని విద్యార్ధినులందరికి వైద్య చికిత్సలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమౌతుంది. ఘటనపై జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆరాతీశారు. పర్యావరణ అధికారులు పాఠశాలకు వెళ్లి పరిస్ధితులను పరిశీలించాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Hand Pump: రోడ్డు మద్యలో నీటి పంపు.. అధికారుల బాధ్యతారాహిత్యానికి నిలువుటద్దం

Exit mobile version