Sonia Gandhi: సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దైంది. అనారోగ్య కారణాలతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా హాజరు కావడం లేదని ఏఐసీసీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం రేపు హైదరాబాద్‌కు సోనియా గాంధీ రావాల్సి ఉంది. అయితే.. అనారోగ్యం కారణంగా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో తెలంగాణ పర్యటనను సోనియా రద్దు చేసుకున్నారు.
స్వయంగా ఆహ్వానించిన సీఎం రేవంత్..(Sonia Gandhi)
దశాబ్దాల తెలంగాణ కల సాకారం చేసినందుకు గాను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకులకు ఆహ్వానించి ఘనంగా సత్కరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సోనియాను కలిసి ఆహ్వానించారు. దీనికి సోనియాగాంధీ కూడా అంగీకరించారు. అయితే వ్యక్తిగత వైద్యుల సలహామేరకు సోనియా గాంధీ తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనితో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా హాజరుకావడం లేదని ఏఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.