Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో అమలు జరుగుతున్న ఆరు సామాజిక సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.వాటిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన (ఎస్సీల కోసం), వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ విద్యోన్నతి మరియు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం ఉన్నాయి.
పేర్లు మార్పు ఇలా..(Andhra Pradesh)
సాంఘిక సంక్షేమ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లుగా పేరు మార్చారు.జగనన్న విదేశీ విద్యా దీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా, వైఎస్ఆర్ కళ్యాణమస్తును చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు.అదేవిధంగా వైఎస్ఆర్ విద్యోన్నతిని ఎన్టీఆర్ విద్యోన్నతిగా, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరును సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గా నామకరణం చేశారు.ఈ మేరకు ఏపీలో కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏపీ రాజముద్ర ఉన్న సర్టిఫికెట్లు మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. 2019-24 మధ్య వచ్చిన కొత్త పథకాల పేర్లు తొలగించాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది.