SIT: ఏపీ ఎన్నికల్లో చెలరేగిన హింసపై సిట్ ఏర్పాటు

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో ఎన్నికల సందర్భముగా ,ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్ ఏర్పాటు చేసారు . ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసారు

  • Written By:
  • Publish Date - May 18, 2024 / 01:28 PM IST

 

 SIT: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో ఎన్నికల సందర్భముగా ,ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్ ఏర్పాటు చేసారు . ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసారు .ఇంకా సిట్ లో 13 మంది అధికారులను సభ్యులుగా నియమించారు .సిట్ లో ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్య లత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ వి శ్రీనివాసరావు, డీఎస్పీ రవి మనోహర చారి, ఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జిఐ శ్రీనివాస్, మెయిన్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్ లు ఉన్నారు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై సిట్‌ దర్యాప్తు చేస్తోంది. ఎన్నికల అనంతర హింస లో పోలీస్ అధికారులు పాత్ర పైనా ఆరాలు తీస్తోంది. ఈ మొత్తం ఘటనలపై ఆదివారం లోగా ఈసీకి సిట్‌ నివేదిక ఇవ్వనుంది.

‘సిట్’కు పూర్తి అధికారాలు..( SIT)

ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రధాన ఘటనలకు సంబంధించిన దర్యాప్తును సిట్ సమీక్షిస్తుంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పోలింగ్ రోజు, పోలింగ్ తదనంతరం జరిగిన సంఘటనలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించాయి . ఇప్పటివరకు జరిగిన కేసు విచారణ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్(ఐవో) నిర్వహించిన దర్యాప్తు తీరును సిట్ పర్యవేక్షిస్తుంది. అదనపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఐవోకు సిఫార్సు చేస్తుంది. అవసరమైతే ప్రతి కేసులోనూ జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది . ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ మార్పులు చేసి, కొత్తగా ఎఫ్ఎఆర్ చేసేలా సిఫార్సు చేస్తుంది. విచార ణకు సంబంధించి అవసరమైన చర్యలపై నిర్ణయం తీసుకునే అధికారాలు సిట్ కు దఖలు పర్చారు.

ఇంకా 144 సెక్షన్‌..

పోలింగ్ రోజు మధ్యాహ్నం ప్రారంభమైన హింస నాలుగు రోజుల పాటు కొనసాగింది. మాచర్ల, నరసరావుపేట, గురజాల ,సత్తెనపల్లి , చంద్రగిరి, తాడిపత్రి, తిరుపతి నియోజకవర్గాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి . ఇంకా కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. తాడిపత్రి, సత్తెనపల్లి, జమ్మలమడుగులో పోలీస్‌ పహారా ఇంకా కొనసాగుతోంది. ప్రధాన పార్టీల ఆఫీస్‌ల ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు.