Hakeempet sports school: హైదరాబాద్ శివార్లలోని హకీంపేటలో ఉన్న తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపుల ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ అధికారిని సస్పెండ్ చేశామని శ్రీనివాస్ గౌడ్ మీడియాకి చెప్పారు.
కఠిన చర్యలు తీసుకుంటాం..(Hakeempet sports school)
మహిళల పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 2, 3 రోజుల్లో విచారణ పూర్తి చేసి కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు,నిందితులకు సహకరించినవారిని కూడా వదిలిపెట్టమన్నారు. విద్యార్థుల్లో ధైర్యం నింపేందుకే తక్షణ చర్యలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు.
@raokavitha అక్క, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తాం. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపుల వార్తలపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి… https://t.co/O2rDflRUWU
— V Srinivas Goud (@VSrinivasGoud) August 13, 2023