Telangana Congress : రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులని ఖరారు చేసేందుకు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సిద్దీఖీ ,రేవంత్ రెడ్డి ,ఉత్తమ్ కుమార్ రెడ్డి ,భట్టి విక్రమార్క హాజరయ్యారు.అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర స్థాయిలో కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇవాళ అభ్యర్థుల తుది జాబితాని రాష్ట్రస్థాయిలో ఖరారు చేస్తారు. సాయంత్రం సీల్డ్ కవర్‌లో సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి స్క్రీనింగ్ కమిటీ సభ్యులు నివేదికని సమర్పిస్తారు.
16,17 వ తేదీల్లో సీడబ్ల్యుసీ సమావేశాలు..(Telangana Congress)
మరోవైపు నేడు సాయంత్రం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 16,17 వ తేదీల్లో సీడబ్ల్యుసీ సమావేశాలు ఉండడంతో కేసి వేణుగోపాల్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సీడబ్ల్యుసీ సమావేశాలు జరిగే తాజ్ కృష్ణ హోటల్, భారీ బహిరంగ సభ కోసం పిసిసి చూసిన రెండు స్థలాలను పరిశీలించనున్నారు. అనంతరం సీడబ్ల్యుసీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కేసి వేణుగోపాల్ దిశా నిర్దేశం చేయనున్నారు.