MLC kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కలిశారు. వీరు ఇద్దరు ఢిల్లీ వెళ్లి జైలులో ఉన్న కవితను కలుసుకుని పరామర్శించారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 15న ఈడీ అధికారులు అరెస్టు చేసినప్పటి నుంచి కవిత గత 80 రోజులుగా తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
కవిత కస్టడీ పొడిగింపు..(MLC kavitha)
10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత, కవితను మార్చి 26న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం పలుమార్లు పొడిగించింది, తాజాగా మరో 14 రోజుల పాటు పొడిగించింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూడ రోజులకిందట కవితను ములాఖత్ లో కలుసుకుని పరామర్శించారు. కవిత భర్త అనిల్ వారానికి రెండుసార్లు ఆమెను జైలుకు వచ్చేవారు. కవితతో కుటుంబసభ్యులు రోజూ ఫోన్లు చేస్తూనే ఉన్నారని సమాచారం.