Janasena chief Pawan Kalyan:జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేనివాడని జనసేన అధినేత పవన్ఖ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి ఏలూరులో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ కు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతంగా దాడిచేస్తున్నారు. ఇకపై జగన్ ను ఏకవచనం తోనే సంబోధిస్తానని అన్నారు. వైసీపీ సర్కార్ హయాంలో 1.18 లక్షల కోట్లు అప్పులు చేసారు. ప్రజలకు జవాబు లేదు. నువ్వు, నీ మంత్రి వర్గం జవాబు చెప్పాలి. రాష్ట్ర అభివృద్దికి ఖర్చు పెట్టి ఉంటే చూపించాలి. ఒక ఐటీ ఎంప్లాయి కారు లోన్ తీసుకోవాలి అంటే బోలెడు పేపర్లు సబ్మిట్ చేయాలి. కాని ఈ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని కాగ్ కూడా ఆరోపించింది. ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కింద 22,500 కోట్లు అప్పలు చేసారు. వీటితో ఏం చేసారనే దానికి సమాధానం లేదు.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేవు. ఇక్కడ సరైన డ్రైనేజీ సదుపాయం లేదు. 300 మంది కింద పడిపోతే ఇప్పటివరకు పట్టించుకున్న వారు లేరు. కొల్లేరు విషతుల్యం అవుతోంది. దీనిని సంరక్షించే బాధ్యత జనసేన తీసుకుంటుంది. రాష్ట్రం అభివృద్ది అవడం అంటే జగన్, మంత్రులు డెవలప్ కావడం కాదు. ఒక్కో ఎమ్మెల్యే వందలకోట్లు దోచేస్తున్నారు. క్లాస్ వార్ అనే పెద్దమనిషి మద్యంపైన 1.28 లక్షలకోట్లు ఆదాయం సంపాదించాడు. మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలో కి వచ్చాడు.ఆడపడుచుల మెడల్లో తాళిబొట్టు తెంపేసాడు. చెత్తమీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్ అంటూ పవన్ మండిపడ్డారు. మీరు ఆలోచించకపోతే మీరే నష్టపోతారు. నా జోలికి ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను. మీరు మాత్రం ప్రభుత్వాన్ని నిలదీసి అడగకపోతే ఇబ్బందులు పడతారు. బుగ్గలు నిమిరితే, ముద్దులు పెడితే మురిసిపోకూడదు. నేను ప్రశ్నిస్తుంటే నా భార్యను, నా తల్లిని కూడా దూషిస్తున్నారు. నేను హైదరాబాద్ లో ఉంటానని జగన్ అంటాడు. మానాన్న మీ నాన్నగారు లాగ సీఎం కాదు. నేను సినిమాలు చేసుకుంటే ఆదాయం వస్తుంది. దానిలోనే కౌలురైతులకు సాయం చేసాను. ఇన్నేళ్లలో ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎందుకంటే నీకు వారు ప్రశ్నిస్తారని భయం.. నిలదీస్తారని భయం.. బయటకు వెళ్లాలంటే మహారాణిలాగా పరదాలు ఉండాలి. అలాంటపుడు ఇడుపులపాయ ఎస్టేల్లో కూర్చోవడం మంచింది. ఏ పల్లెకు వెళ్లనివాడివి ఎక్కడుంటే ఏమిటి? అధికారంనుంచి దించాక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిన్ను జవాబుదారీ చేస్తాము. నువ్వు రోడ్లు సరిగా వేస్తే ప్రమాదాలు ఉండవు. మరి ఆ రోడ్లకోసం వేసిన డబ్బులు ఏం చేసావు జగన్ అంటూ పవన్ ప్రశ్నించారు.
ఏపీలో 30 వేలమంది అమ్మాయిలు అదృశ్యమయిపోయారు. అందులో 14 వేల మంది తిరిగి వచ్చారు. మిగతా 15 వేలమంది ఏమయ్యారు? వీరిపై ఒక్కసారయినా రివ్యూ మీటింగ్ పెట్టారా? నేను జగన్ ను, డీజీపీ గారిని అడుగుతున్నాను. ప్రతీ ఊరిలో ప్రతీ గ్రామంలో ఆడపిల్లలు, మహిళల సమాచారాన్ని వాలంటీర్ల ద్వారా సేకరించి వారిని అక్రమరవాణా చేస్తున్నారు. ఈ విషయం నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. ఇందులో వైసీపీ ప్రభుత్వంలో నాయకుల పాత్ర ఉంది.ఇంతమంది ఉసురు తీసుకుంటున్నావు జగన్.. దీనికి ఫలితం అనుభవిస్తావు. జగన్ కు, దారిదోపిడీ దొంగకు తేడా లేదు. ఎండిపోయిన హృదయం బలమైన నాయకుడి కోసం చూస్తుంది. అలా చూసి జగన్ కు అవకాశం ఇచ్చారు. మీరు గెలిపించినా, గెలిపించకపోయినా నేను పోరాటం ఆపను. జనసేన పోరాటం ఆపదు. ఎందుకంటే నాకు మీరంటే అంతప్రేమ. నేను దేశం, సమాజం నాది అనుకుంటాను. జగన్ నువ్వు క్రిమినల్ వి. నువ్వు గూండావు. నిన్న సీఎంగా చూడాలంటే సిగ్గేస్తోంది అంటూ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. అభివృద్ది జరగాలంటే, అరాచకం ఆగాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని దించితీరాలని పవన్ కళ్యాణ పిలుపు నిచ్చారు.