Site icon Prime9

ఆంధ్రప్రదేశ్: గుట్టలు గుట్టలుగా కుళ్లిపోయిన చికెన్.. పురుగులు పట్టిన మాంసం

chicken

chicken

Nellore: నెల్లూరు జిల్లాలో చికెన్ స్టాల్‌ యజమానులు నిల్వ ఉంచిన, కుళ్లిపోయిన చికెన్ ను చెన్నైలో తక్కువ ధరకు కొని దానిని నెల్లూరులోని హోటల్స్, ధాబాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు విక్రయిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని హరనాధపురం వద్ద భారీగా కుళ్లిపోయిన చికెన్ నిల్వలను అధికారులు పట్టుకున్నారు.

అంజాద్ బాషా అనే వ్యక్తి ఫ్రీజర్లను ఏర్పాటు చేసి అందులో నిల్వ ఉంచిన మాంసాన్ని ఉంచి నగరంలో హోటళ్లకు విక్రయిస్తున్నాడు. నెల్లూరు కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ చేసిన దాడుల్లో ఈ ఫ్రీజర్లలో కుళ్లిపోయిన మాంసానికి పురుగులు పట్టినట్లు గుర్తించారు. ఫ్రీజర్లు తెరవగానే భరించలేని దుర్గంధం వెలువడటంతో అధికారులు నిర్ఘాంతపోయారు. ఈ మాంసాన్నే హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్బంగా వందలకేజీల చికెన్ లివర్ స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసారు. ప్రజారోగ్యంతో ఆటలాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Exit mobile version