Site icon Prime9

Raghunandan Rao: రేవంత్ రెడ్డి మెదక్ లో తప్పుడు స్క్రిప్ట్ చదివారు.. రఘునందన్ రావు

Raghunandan Rao

Raghunandan Rao

Raghunandan Rao: రేవంత్ రెడ్డి మెదక్ లో తప్పుడు స్క్రిప్ట్ చదివారన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. మెదక్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధుల నివేదికను రేవంత్ రెడ్డికి కొరియర్ పంపించానని తెలిపారు. మెదక్ నివేదికే హరీష్ రావుకు, రేవంత్ రెడ్డికి సమాధానం చెబుతోందని చెప్పారు. మతకల్లోలాలు చేయడం బీజేపీ సిద్దాంతం కాదని.. కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుకున్నది, మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు, సోకాల్డ్ వాదులని విమర్శించారు.

రేవంత్ రెడ్డి, హరీష్ రావు దోస్తులు..(Raghunandan Rao)

రేవంత్ రెడ్డి, హరీష్ రావు మంచి మిత్రులు.. వారిది బొమ్మ బొరుసు సంబంధం, అందుకే ఓటుకు నోటు కేసు ఆగిపోయిందని రఘునందన్ రావు అన్నారు. గడీలనుంచి వచ్చిన బీజేపీ నేత మెదక్ లో పోటీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి మాట్లాడారు. తన పేరు మీద ఉన్న గడీని రేవంత్ రెడ్డి కి రాసివ్వడానికి సిద్దంగా ఉన్నానని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడొస్తారో, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకుంటారో చెప్పాలన్నారు. కెసిఆర్ పిట్టల దొర అనుకుంటే రేవంత్ రెడ్డి వ్యవహారం అంతకు రెండoతలు మాదిరగా ఉందన్నారు. జీవన్ రెడ్డికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి చేస్తారట. చేతనైతే ముందు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గా చేయండని రేవంత్ రెడ్డికి సూచించారు. మోదీ వెంట్రులకు కూడా రేవంత్ రెడ్డి సరిపోడని మోదీని విమర్శించే అర్హత రేవంత్ రెడ్డికి లేదని రఘనందన్ రావు అన్నారు. కామారెడ్డిలో కేటీఆర్ అయ్య కేసీఆర్ మెడలు వంచింది కాషాయ జెండా అన్న రఘునందన్ బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని చెప్పారు.

Exit mobile version