Site icon Prime9

Junior NTR: ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు

junior NTR

junior NTR

Junior NTR: నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలలో బాలకృష్ణ ఫోటో లేదని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోటో లేని ప్లెక్సీలను తొలగించాలని తోటి నాయకులను ఆదేశించారు. దీనితో రంగంలోకి దిగిన బాలయ్య అనుచరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్లెక్సీలను తొలగించారు. దీనితో నందమూరి అభిమానుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.గురువారం వేకుమజామున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని నివాళులు అర్పించారు.

వెన్నుపోటు పొడిచి..(Junior NTR)

ఇలాఉండగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని అన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబును ఎవరూ పట్టించుకోరన్నారు. రాజమండ్రి జైల్‌కి ‘రా కదలి రా’ అని చంద్రబాబుకు కోర్టు చెప్పిందని ఎద్దేవా చేశారు. కొడుకును సీఎం చేయాలన్నదే బాబు ఆలోచన కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు వర్థంతి చేస్తారా అని నిలదీశారు. కృష్ణా జిల్లా గుడివాడలోని కేశినేని భవన్‌లో ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.

తీయించేయ్ నా కంటికి కనబడకూడదు | Balakrishna Reaction On Jr NTR Flexis | Prime9 News

Exit mobile version
Skip to toolbar