Site icon Prime9

AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

AB Venkateswara Rao

AB Venkateswara Rao

 AB Venkateswara Rao: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కు హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ – క్యాట్‌ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏబీవీ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్‌ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. క్యాట్‌ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు నిరాకరిస్తూ ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టివేసింది.

వివాదాల్లో ఏబీవీ.. ( AB Venkateswara Rao)

2014 -19 టీడీపీ ప్రభుత్వ హయాంలో రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసింది. తనను అన్యాయంగా సస్పెండ్ చేసారనిఆయన క్యాట్‌లో అప్పీల్ చేసారు . మొదట్లో క్యాట్ సస్పెన్షన్‌ను సమర్థించింది. అప్పుడు ఆయన హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు . హై కోర్ట్ సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు పిటిషన్ వేసింది . సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను సుప్రీమ్ కోర్ట్ కూడా రద్దు చేసింది. సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలకనుగుణంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏకారణంతో ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందో మళ్ళీ అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

చివరికి ఊరట..

ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు మరో సారి క్యాట్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్‌.. ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏబీవీకి వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని.. సస్పెన్షన్‌ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్యాట్‌ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరలా హై కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు క్యాట్‌ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు నిరాకరించింది.

Exit mobile version